క్రీడాభూమి

ఢాకా స్టేడియంలో కమాండో ఆపరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 6: బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం జరిగే మొదటి వనే్డకు ఆతిథ్యమిచ్చే షేన్ ఏ బంగ్లా స్టేడియంలో హఠాత్తుగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. హెలికాప్టర్ నుంచి తాళ్ల సాయంతో సుమారు డజను మంది కమాండోలు నేరుగా మైదానంలోకి దిగారు. తుపాకులు పట్టుకొని స్టాండ్స్ వైపు దూసుకెళ్లారు. అవసరమైతే కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు పొజిషన్స్ తీసుకున్నారు. బాంబు బెదిరింపు వచ్చినప్పుడు తనిఖీలు నిర్వహించే విధంగా అణువణువునూ క్షుణ్ణంగా పరిశీలించారు. మెరుపు వేగంతో యుద్ధ వ్యూహాలను ప్రదర్శించి, క్షణాల్లో వెళ్లిపోయారు. ఇదంతా శుక్రవారం నాటి వనే్డ కోసం చేసిన హడావుడి. భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతో ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఓపెనర్ అలెక్స్ హాలెస్ తదితరులు బంగ్లాదేశ్ టూర్‌కు నిరాకరించిన విషయం తెలిసిందే. వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా, ఈ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు భరోసా ఇప్పించడమే కమాండోల విన్యాసాల లక్ష్యం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, క్షణాల్లో అదుపులోకి తీసుకురాగలమని బంగ్లాదేశ్ ఆర్మీ కమాండోలు మాక్ అటాక్‌తో నిరూపించారు.