క్రీడాభూమి

ఐపిఎల్ కొనసాగింపుపై సంఘాలదే తుది నిర్ణయం: ఠాకూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను కొనసాగిం చాలా? వద్దా? అన్న అంశంపై సభ్య సంఘాలదే తుది నిర్ణయమని బిసిసిఐ అ ధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. 2013 ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పా ట్ ఫిక్సింగ్, బెట్టింగ్ సంఘటన అనంతరం భారత క్రికెట్‌లో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిసిసిఐ ప్రక్షాళనకు లోధా కమిటీ సిఫా ర్సులు చేయడానికి కూడా అదే నేపధ్యం. కాగా, క్రికెట్‌ను ఐపిఎల్ ఒక వ్యాపా రంగా మార్చేసిందని, ఆట కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తీ వ్ర స్థాయలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ‘జంటిల్మన్ క్రికెట్’ను గ్యాంబ్లింగ్ క్రీడగా మార్చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయ. ఐపిఎల్‌పై వస్తున్న విమర్శ లు తనను మానసికంగా వేధిస్తున్నాయని అన్ని సభ్య సంఘాలకు రాసిన లేఖ లో ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపిఎల్ ద్వారా గత తొమ్మిదేళ్లలో 2,650 కోట్ల రూపాయలు సభ్య సంఘాలకు లభించిన విషయాన్ని గుర్తుచేశాడు. అ దే విధంగా పన్నుల రూపంలో 2,244 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలిపా డు. మాజీ క్రికెటర్లకు 110 కోట్ల రూపాయలు ఇచ్చామని అన్నాడు. ఎంతో మం దికి ఐపిఎల్ ద్వారా ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతున్న ఐపిఎల్‌పై విమర్శలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. అందుకే, ఐపిఎల్‌ను కొనసాగించాలా? వద్దా? అన్న విష యంలో సభ్య సంఘాలే తుది నిర్ణయం తీసుకోవాలని అన్నాడు.