క్రీడాభూమి

చైనా ఓపెన్ టోర్నమెంట్‌లో నాదల్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 7: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన నాదల్‌పై శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో అన్‌సీడెడ్ ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ 6-2, 6-4 సెట్ల తేడాతో సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో నాదల్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కాగా, ఈ టోర్నీలో బ్రిటన్‌కు చెందిన టాప్ సీడ్ ఆటగాడు ఆండీ ముర్రేతో పాటు స్పెయిన్‌కు చెందిన ఐదోసీడ్ డేవిడ్ ఫెర్రర్ కూడా సెమీఫైనల్స్‌లో ప్రవేశించారు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ముర్రే 7-6, 6-2 సెట్ల తేడాతో అన్‌సీడెడ్ ఆటగాడు కైల్ ఎడ్మండ్‌ను మట్టికరిపించగా, అన్‌సీడెడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ ఫెర్రర్ 6-7, 6-1, 7-5 తేడాతో చెమటోడ్జి విజయం సాధించాడు. అయితే ఫ్రాన్స్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్ కూడా చుక్కెదురైంది. రెండో రౌండ్ పోరులో అన్‌సీడెడ్ ఆటగాడు పాబ్లో కారెనో బస్టా 5-7, 6-4, 6-1 తేడాతో గాస్కెట్‌కు చెక్‌పెట్టి క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించాడు.