క్రీడాభూమి

క్రీడాకారులు ఎక్కడైనా ఆడొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 7: క్రీడాకారులకు సహచర ప్రత్యర్థులతో ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడే హక్కు ఉందని ప్రముఖ మహిళా రెజ్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాఖ్యలు ఉరీలో ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను భారత్‌లో ఆడేందుకు అనుమతించాలా? అనే అంశంపై చర్చకు దారితీయడంతో ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. బెంగళూరులో శుక్రవారం గరుడా మాల్ 11వ వార్షికోత్సవానికి విచ్చేసిన సాక్షి మాలిక్ విలేఖర్లతో మాట్లాడుతూ, తన అభిప్రాయాన్ని మీడియా వక్రీకరించిందని, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లను ఆహ్వానించాలని తాను చెప్పినట్లు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. వాస్తవానికి తాను అలా మాట్లాడలేదని ఆమె పేర్కొంది. ‘ఒలింపిక్స్‌లో మేము వివిధ దేశాలకు చెందిన అనేక మంది క్రీడాకారులతో ఆడినట్లుగానే క్రీడాకారులందరికీ క్రీడల్లో (ఒలింపిక్స్‌లో) పాల్గొనే హక్కు ఉందని మాత్రమే నేను చెప్పా. అంతకుమించి ఇంకేమీ మాట్లాడలేదు. భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్ క్రీడాకారులను అనుమతించాలని నేను చెప్పలేదు’ అని సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.
క్రికెటర్ యువరాజ్ సింగ్, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ లాంటి కొందరు క్రీడాకారుల మాదిరిగా మీరు కూడా అంకుర సంస్థలు (స్టార్టప్‌లు), వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అని విలేఖర్లు ప్రశ్నించగా, తనకు కుస్తీ అంటే చాలా ఇష్టమని, వనరుల లేమితో క్రీడల్లో నిలదొక్కుకోలేకపోతున్న చిన్నారులకు చేయూతనివ్వాలని భావిస్తున్నానని ఆమె తెలిపింది. విజయమంటే కేవలం డబ్బు సంపాదించడమో లేక పతకాన్ని గెలవడమో కాదని, దేశం కోసం ఏవైనా మంచి పనులు చేయగలిగినప్పుడే విజయం సాధించినట్లు భావిస్తానని సాక్షి మాలిక్ పేర్కొంది. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, దేశంలో చాలా మంది తన గురించి తెలుసుకోవడం ప్రారంభించారని, దీంతో తన బాధ్యతలు మరింత పెరిగాయని ఆమె చెప్పింది.
chitram...
మైసూరు తలపాగా ధరించి
చిరునవ్వులు చిందిస్తున్న సాక్షి