క్రీడాభూమి

కెప్టెన్‌గా.. చాలా నేర్చుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 7: తమకు ప్రతికూలంగా మారుతున్న సెషన్‌ను ఎలా కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనేది కెప్టెన్సీలో తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠాల్లో ఒకటని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వికెట్లు తీయలేకపోతున్న సమయంలో పరుగులను ఎలా కట్టడి చేయాలి, ప్రత్యర్థిపై ఒత్తిడి ఎలా పెంచాలనేది కెప్టెన్‌గా తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠాల్లో ఒకటని శనివారంనుంచి ఇక్కడ న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టెస్టు సందర్భంగా శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కోహ్లీ చెప్పాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు ఒకే కోణంలోకి వెళ్లడం సరికాదని అతను చెప్పాడు. భారత్ ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తాత్కాలిక ఓపెనర్‌తో ప్రయోగాలు చేయకూడదని, అనుభవజ్ఞుడైన గౌతమ్ గంభీర్‌కు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తన సత్తాను తిరిగి చాటుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడానికే కోహ్లీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మురళీ విజయ్‌తో కలిసి గౌతమ్ గంభీర్ బ్యాటింగ్‌ను ప్రారంభించే అవకాశాల గురించి విలేఖరులు ప్రశ్నంచగా, అది సహజమైన మార్పేనని, ఎందుకంటే జట్టులో ఉండే మూడో ఓపెనర్ అతనేనని కోహ్లీ చెప్పాడు.
ఇదిలా ఉండగా, శనివారం ఇక్కడ ప్రారంభమయ్యే మూడో టెస్టులో తాను ఆడే అవకాశముందని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ సూచనప్రాయంగా తెలియజేశాడు. మూడో టెస్టుకు తాను పూర్తిస్థాయిలో కోలుకొంటానన్న ఆశాభావాన్ని అతను వ్యక్తం చేశాడు. కాగా, పరిస్థితులు తమకు అనుకొలంగా లేకపోయినప్పటికీ చివరి టెస్టులో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడానికే తమ జట్టు ప్రయత్నిస్తుందని కూడా అతను చెప్పాడు.