క్రీడాభూమి

స్టోక్స్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, అక్టోబర్ 7: బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన మూడు వనే్డల క్రికెట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ బోణీ చేసింది. మీర్పూర్‌లోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టును మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ విజృంభించి ఆడి అంతర్జాతీయ వనే్డల్లో తొలి శతకాన్ని నమోదు చేసుకోగా, ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ డకెట్ (60), వికెట్ కీపర్ జోస్ బట్లర్ (63) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 309 పరుగుల స్కోరు సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టుపై ఇంగ్లాండ్ బౌలర్లు జాక్ బాల్ (5/51), ఆదిల్ రషీద్ (4/49) నిప్పులు చెరిగారు. వీరి జోరును ప్రతిఘటించడంలో బంగ్లాదేశ్ జట్టు ఘోరంగా విఫలమైంది. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ ఇమ్రుల్ కయాస్ (112), సీనియర్ బ్యాట్స్‌మన్ షకీబ్ అల్ హసన్ (79), మహ్మదుల్లా (25) మినహా మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో 47.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 51 పరుగులకే 5 వికెట్లు కైవసం చేసుకుని ఇంగ్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన జాక్ బాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.