క్రీడాభూమి

రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రీ సెమీస్‌కు రుత్విక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్లాదివొస్తోక్ (రష్యా), అక్టోబర్ 7: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు రుత్విక శివానీ, సిరిల్ వర్మ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రుత్విక (18) శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో రష్యాకు చెందిన ఎలెనా కొమెంద్రోవ్‌స్కజాను మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభంలో కాస్త వెనుకబడి 13-21 తేడాతో తొలి గేమ్‌ను చేజార్చుకున్న రుత్విక ఆ తర్వాత అద్భుత పోరాట పటిమను కనబర్చింది. ఫలితంగా 21-10, 21-17 తేడాతో వరుసగా రెండు గేమ్‌లను కైవసం చేసుకుని మొత్తం మీద 52 నిమిషాల్లో ప్రత్యర్ధిని ఓడించింది. శాఫ్ గేమ్స్‌లో పసిడి పతకంతో సత్తా చాటుకున్న రుత్విక ఫైనల్‌లో స్థానం కోసం రష్యాకే చెందిన మరో షట్లర్ క్సెనియా పొలికర్పోవాతో తలపడనుంది.
కాగా, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో సిరిల్ వర్మ మలేసియాకి చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు జుల్హెల్మీ జుల్క్ఫ్లిపై విజయం సాధించాడు. 36 నిమిషాల పాటు పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సిరిల్ వర్మ 21-12, 21-18 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. 2013లో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా జూనియర్ అండర్-15 చాంపియన్‌షిప్స్‌లో టైటిళ్లను కైవసం చేసుకున్న సిరిల్ వర్మ సెమీ ఫైనల్‌లో రష్యాకు చెందిన అనతోలీ యార్‌త్సెవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ఇదిలావుంటే, ఈ టోర్నీలో భారత్‌కు చెందిన ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. గత నెలలో బ్రెజిల్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకున్న ప్రణవ్, సిక్కీ శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ పోరులో రష్యాకు చెందిన అలెగ్జాండర్ వాసిల్కిన్, క్రిస్టినా విర్విచ్ జోడీని మట్టికరిపించారు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 21-10, 21-8 తేడాతో ప్రత్యర్థులను ఓడించిన ప్రణవ్, సిక్కీ సెమీ ఫైనల్‌లో రష్యాకే చెందిన అనతోలీ యార్‌త్సెవ్, యెవగెనియా కొసెత్‌స్కయా జోడీతో తలపడనున్నారు.
అయితే మహిళల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన మూడో సీడ్ క్రీడాకారిణి తన్వీ లాడ్‌తో పాటు డబుల్స్ విభాగంలో జక్కంపూడి మేఘన, పూర్విష ఎస్.రామ్ సెమీఫైనల్స్‌కు చేరడంలో విఫలమయ్యారు. రష్యా క్రీడాకారిణి యెవగెనియా కొసెత్‌స్కయాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తన్వీ లాడ్ 16-21, 19-21 తేడాతో ఓటమిపాలవగా, రష్యాకే చెందిన తజానా బిబిక్, ఎలెనా కొమెంద్రోవ్‌స్కజా జోడీతో జరిగిన డబుల్స్ పోరులో మేఘన, పూర్విష 14-21, 21-13, 18-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నారు.