క్రీడాభూమి

రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధులు ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేవరకూ 12 రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిధులను విడుదల చేయరాదని సుప్రీం కోర్టు శుక్రవారం నిషేధాన్ని విధించింది. లోధా కమిటీ సిఫారసుల అమలుకు తీర్మానాన్ని ఆమోదించకపోతే రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నిధులను పొందలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా లోధా కమిటీ సిఫారసుల విషయమై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చీఫ్ డేవిడ్ రిచర్డ్‌సన్‌తో జరిపిన సంభాషణలకు సంబంధించి వ్యక్తిగతంగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను ఆదేశించింది. లోధా కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు తిరస్కరిస్తున్న బిసిసిఐ ఆఫీస్ బేరర్లను తొలగించి వారి స్థానంలో తాత్కాలిక అడ్మినిస్ట్రేర్లను నియమించే విషయమై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బిసిసిఐ రాత్రికి రాత్రే 400 కోట్ల రూపాయలు బదిలీ చేయడాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ గురువారం తప్పుబట్టిన విషయం విదితమే. రాత్రికి రాత్రే 400 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేయరాదని, రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు నిధులను సమకూర్చే విషయంలో బిసిసిఐ పారదర్శకంగా వ్యవహరించాల్సిందని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఇదిలావుంటే, లోధా కమిటీ సిఫారసులను తాము అంగీకరించడం లేదన్న ఆరోపణలను బిసిసిఐ తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో లోధా కమిటీకి, తమకు మధ్య సాగిన 40 మెయిళ్ల (ఉత్తరప్రత్యుత్తరాల) రికార్డులను న్యాయస్థానానికి సమర్పిస్తామని బిసిసిఐ తెలిపింది. ‘లోధా కమిటీ పంపిన మెయిళ్లకు మేము స్పందించలేదన్నది అవాస్తవం. ఈ మెయిళ్లకు ప్రతిస్పందిస్తూ జస్టిస్ లోధాకు మేము పంపిన 40 మెయిళ్ల రికార్డులను మీముందు ఉంచుతాం’ అని సుప్రీం కోర్టుకు బిసిసిఐ విన్నవించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను బిసిసిఐ ధిక్కరిస్తూ, సంస్కరణల ప్రక్రియను అడ్డుకుంటోందని గత వారం సుప్రీం కోర్టుకు సమర్పించిన స్థితిగతుల నివేదికలో లోధా కమిటీ పేర్కొంది. అంతేకాకుండా బిసిసిఐ అధినాయకులందరికీ ఉద్వాసన పలకాలని లోధా కమిటీ సిఫారసు చేసింది. సెప్టెంబర్ 21వ తేదీన నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో బిసిసిఐ తాము నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఐదుగురు సభ్యులతో సెలక్షన్ కమిటీని నియమించడంతో లోధా కమిటీ ఈ చర్య చేపట్టింది.
లోధా కమిటీ నిర్దేశించిన మార్గదర్శకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బిసిసిఐకి సుప్రీం కోర్టు గతంలో చీవాట్లు పెట్టడంతో పాటు ఆ కమిటీ నివేదికపై ఈ నెల 6వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 1వ తేదీన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన బిసిసిఐ, లోధా కమిటీ సిఫారసుల్లో ‘ప్రధానమైన చాలా సిఫారసులను’ ఆమోదించినప్పటికీ, తమకూ, లోధా కమిటీకి మధ్య వివాదాస్పదంగా మారిన కొన్ని సిఫారసులను మాత్రం పక్కన పడేసింది. ఒక రాష్ట్రానికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, బిసిసిఐ పాలక మండలి సభ్యుల వయో పరిమితి 70 ఏళ్లు దాటరాదన్న పలు కీలక సిఫారసులను బిసిసిఐ ఇప్పటికీ ఆమోదించలేదు. అయితే ఈ విషయంలో బిసిసిఐ తన చర్యను సమర్ధించుకుంది. లోధా కమిటీ చేసిన కొన్ని సిఫారసులను బోర్టు సమావేశంలో ఓటింగ్ ద్వారా తిరస్కరించడం జరిగిందని, ఈ సమావేశానికి బోర్డు సభ్యులంతా హాజరయ్యారని బిసిసిఐ చెప్పుకొచ్చింది.