క్రీడాభూమి

మరో క్లీన్ స్వీప్‌కు కోహ్లీసేన రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 7: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని కూడా పదిలం చేసుకున్న భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో మరో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఇక్కడ శనివారంనుంచి ఇక్కడ ప్రారంభం కానున్న మూడో టెస్టు బరిలోకి దిగుతోంది. 2012-13లో ఆస్ట్రేలియాను, ఆ తర్వాతి సిరీస్‌ను 4-0 తేడాతో చిత్తు చేసి క్లీన్‌స్వీప్ సాధించిన భారత్, గత ఏడాది దక్షిణాప్రికాతో జరిగిన సిరీస్‌లో సైతం దాదాపుగా ఈ ఘనతకు దరిదాపుల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ టెస్టులో సైతం భారత్ ఫేవరేట్‌గా నిలుస్తోంది.
ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోను ఆతిథేయ జట్టుకు కొన్ని సందర్భాల్లో గట్టి పోటీయే ఇచ్చిన న్యూజిలాండ్ ఇప్పటివరకు సొంతగడ్డపై ఆడిన 14 టెస్టుల్లో 12 టెస్టులను గెలుచుకుని అప్రతిహతంగా దూసుకుపోతున్న కోహ్లీ సేనకు గట్టి పోటీ ఇవ్వాలంటే అంతకు మించి రాణించాల్సి ఉంటుంది. అనారోగ్యం కారణంగా రెండో టెస్టులో ఆడలేక పోయిన తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పూర్తిగా కోలుకుని చివరి టెస్టులోనైనా భారత గడ్డపై తమకు అరుదైన విజయాన్ని అందించడానికి నాయకత్వ బాధ్యతలు చేపడతారన్న కొండంత ఆశతో న్యూజిలాండ్ ఉంది. విలియమ్సన్ గురువారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. చివరి టెస్టులో అతను ఆడే సంకేతాలు బాగా కనిపిస్తున్నాయని జట్టు బౌలింగ్ కోచ్ షేన్ జర్గెన్‌సెన్ కూడా చెప్పారు. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను దీటుగా ఎదుర్కోగల కివీస్ బ్యాట్స్‌మన్‌లలో విలియమ్సన్ ఒకరనేది అందరికీ తెలిసిందే. అతను లేకపోవడంతో కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టులో కివీస్ పెద్దగా పోరాటం చేయకుండానే చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
కాగా, వెన్నునొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్ సేవలు భరాత జట్టుకు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో ఆడిన ఉమేశ్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు కెఎల్ రాహుల్, శిఖర్‌ధావన్ ఇద్దరూ కూడా గాయాలతో జట్టుకు దూరమైన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఓపెనర్‌గా భారత జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ గంభీర్‌కు ఇదో సువర్ణావకాశమనే చెప్పాలి. ఈ రెండు సమస్యలు తప్ప భారత జట్టుకు అటు బౌలింగ్‌లో కానీ, ఇటు బ్యాటింగ్‌లో కానీ పెద్దగా ఎలాంటి సమస్యలూ లేవు. కాగా, ఈ టెస్టుకు వాతావరణం కాస్త సమస్యగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గురువారం ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు రాత్రి వర్షం కురిసింది కూడా. అయితే మ్యాచ్ చివరి రెండు రోజుల్లో తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉంది తప్ప భారీ వర్షం వచ్చే అవకాశం లేదని వాతావరణ అధికారులు అంటున్నారు.
chitram...
మైదానంలో న్యూజిలాండర్ల సాధన