క్రీడాభూమి

‘కెప్టెన్ కూల్’ ధోనీకి అరెస్టు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 8: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి అరెస్టు నాన్-బెయలబుల్ వారెంట్ జారీ చేస్తూ అనంతపురం జిల్లా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి గీతావాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014 జూన్ 3వ తేదీ బిజినెస్ టుడే మాసపత్రిక ఎడిటర్ చైతన్య కాల్‌బాగ్, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని ఆరోపిస్తూ విహెచ్‌పి నేత యర్రగుంట్ల శ్యాంసుందర్ వీరిద్దరిపై కోర్టులో పిటిషన్ వేయగా ఆరు నెలల తర్వాత సాంకేతిక కారణాలతో కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అయినా శ్యాంసుందర్ న్యాయవాది 6-214 ప్రకారం క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా చైతన్య కాల్‌బాగ్, ధోనిలకు ఎస్సీ ఎస్టీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో చైతన్య కాల్‌బాగ్ న్యాయవాది సమన్లను రీకాల్ చేయించుకున్నాడు. అయితే ఈ కేసులో ఎ-2గా ఉన్న ధోనీ సమన్లు తీసుకున్నప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అనంతరం చైతన్యకాల్‌బాగ్, ధోని ఇద్దరూ తమ న్యాయవాదుల ద్వారా కౌంటరు దాఖలు చేసుకుని వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసును పునర్ విచారణ చేయాలంటూ జెఎఫ్‌సిఎం కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కేసును విచారణకు స్వీకరించి కోర్టు చైతన్య కాల్‌బాగ్, ధోనీలకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో కోర్టు వారికి పలుమార్లు సమన్లు జారీ చేసినా వారిలో ఎ-2 అయిన ధోనీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో శుక్రవారం జిల్లా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి గీతావాణి ఈ కేసును 2016 ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తూ క్రికెటర్ ధోనీకి అరెస్టు వారెంట్ జారీ చేసింది.

కోర్టు ఆదేశాలు తప్పు
ధోనీ లాయరు ఆవేదన
న్యూఢిల్లీ, జనవరి 8:్ధనీకి ఆంధ్రప్రదేశ్‌లోని కోర్టునుంచి వ్యక్తిగతంగా ఎప్పుడూ సమన్లు అందలేదని ఆయన లాయరు రజనీష్ చోప్రా అంటూ అందువల్ల కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేయడం తప్పని అన్నారు. ఒక వేళ సమన్లు జారీ అయ్యాయని అనుకున్నప్పటికీ కర్నాటకలోని బెంగళూరు జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసులో విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసిందని ఆయన చెప్తూ, ఈ కేసులో కూడా తాము కోర్టులను ఆశ్రయించి అక్కడినుంచి తగిన ఆదేశాలు పొందుతామని ధోనీ నిర్వహిస్తున్న కంపెనీ రితి స్పోర్ట్స్ జారీ చేసిన ఒక ప్రకటనలో చోప్రా అన్నారు.