క్రీడాభూమి

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ గ్లీసన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 8: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ జాన్ గ్లీసన్ (78) కన్నుమూశాడు. 1967 నుంచి 1972 వరకూ కొనసాగిన ఇంటర్నేషనల్ కెరీర్‌లో అతను మొత్తం 29 టెస్టులు ఆడాడు. 93 వికెట్లు పడగొట్టాడు. 1966-67 సీజన్‌లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున దేశవాళీ మ్యాచ్‌లో కేవలం ఐదు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి సంచలనం రేపాడు. ఆతర్వాత సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులకు ఐదు వికెట్లు సాధించాడు. దీనితో అతనికి ఆస్ట్రేలియా ‘బి’ టీంలో స్థానం లభించింది. ఫాస్ట్ బౌలింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చే ఆస్ట్రేలియాలో అతను అత్యంత కష్టం మీద జాతీయ జట్టులోకి అడుగుపెట్టగలిగాడు. కానీ, టెస్టు కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు. ఆసీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించకపోవడంతో, తన సామర్థ్యం నిరూపించుకోవడానికి అతనికి తగినన్ని ఆవకాశాలు రాలేదు.

జాన్ గ్లీసన్ (ఫైల్ ఫొటో)