క్రీడాభూమి

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 8: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్‌ని భారత్ 34 పాయంట్ల తేడాతో గెల్చుకుంది. ఆసీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబరచిన భారత్ 54 పాయంట్లు సంపాదించగా, ఆస్ట్రేలియా 20 పాయంట్లు మాత్రమే చేయగలిగింది. అయతే, ప్రపంచ కప్ టోర్నీలో కొత్తగా అడుగుపెట్టిన ఈ జట్టు తన మొదటి మ్యాచ్‌లోనే రెండు పదుల పా యంట్లు సంపాదించడం విశేషమే. రెండుసార్లు టై టిల్ సాధించి, అత్యంత బలమైన జట్టుగా పేరు సంపాదించిన భారత్‌కు ఎదురునిలవడం ఆసీస్‌కు అసాధ్యమన్న విషయం మ్యాచ్ ఆరంభంలోనే స్ప ష్టమైంది. అయతే, మొదటి మ్యాచ్‌ని చేజార్చుకోవ డంతో తీవ్రమైన ఒత్తిడికి గురైన భారత ఆటగాళ్లు ఏ విధంగా ఎదురుదాడికి దిగుతారోనన్న అనుమా నం అభిమానులను వేధించింది. కానీ, ఓటమిని ఏ మాత్రం పట్టించుకోని భారత్ అసాధారణ స్థాయ లో దాడులకు ఉపక్రమించింది. అనుకున్న ఫలితా న్ని సాధించింది. పసికూన ఆస్ట్రేలియాకు ఏ దశలో నూ కోలుకునే అవకాశం ఇవ్వకండా ఆధిక్యాన్ని కొ నసాగించింది.
దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగినప్పటికీ అనూహ్యంగా ఓటమిపాలైన భారత్ తన రెండో మ్యాచ్‌కి మూడు మార్పులు చేసింది. రాహుల్ చౌ దరి, జస్వీర్ సింగ్, మోహిత్ చిల్లార్‌లను తప్పించి, వారి స్థానంలో ప్రదీప్ నర్వాల్, సందీప్ నర్వాల్, దీ పక్ హూడాలను భారత్ బరిలోకి దిగింది. ఆరం భంలో విశ్రాంతిదిచ్చిన ముగ్గురు ఆటగాళ్లను స మయానుకూలంగా సబ్‌స్టిట్యూట్స్ రూపంలో ఆ డించి, అద్భుతమైన యుద్ధరీతిని చాటుకుంది. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడిన భారత్ మొ దటి నుంచి దూకుడుగా ఆడింది. వేగంగా పా యంట్లను కొల్ల గొట్టడానికి అధిక ప్రాధాన్యం ఇ చ్చింది. ప్రథమా ర్ధం ముగిసే సమయానికి ఏకంగా 32-7 పాయంట్ల ఆధిక్యాన్ని సంపాదించింది.
సెకండ్ హాఫ్‌లోనూ అదే దూకుడును కొనసా గించిన భారత్ తన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఆట కొనసాగుతున్నంత సేపూ ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడడంలోనే ఆసీ స్ ఎక్కువ సమయాన్ని వృథా చేసుకుంది.
ఇంగ్లాండ్ చిత్తు
అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ను బంగ్లాదేశ్ 52-18 పాయంట్ల తేడాతో చిత్తు చే సింది. గత రెండు ప్రపంచ కప్ టోర్నీలో మూడో స్థానాన్ని ఆక్రమించిన బంగ్లాదేశ్ తన స్థాయకి తగి న ఆటతో ఇంగ్లాండ్‌పై విరుచుకుపడింది. అంతర్జా తీయ కబడ్డీ వేదికలపై అంతగా అనుభవం లేని ఇంగ్లాండ్ ఆటగాళ్లు పాయంట్ల కోసం ఎంతగా శ్ర మించినా ఫలితం లేకపోయంది.
ఉత్కంఠ పోరు
కెన్యా, పోలాండ్ జట్ల మధ్య జరిగిన పోరు చివ రి వరకూ ఉత్కంఠ రేపింది. నువ్వా? నేనా? అన్న చందంగా పోటీపడిన ఇరు జట్లు ప్రేక్షకులను ఆక ట్టుకున్నాయ. ఎంతో కష్టం మీద కెన్యా ఈ మ్యాచ్ ని 54-48 పాయంట్ల తేడాతో గెల్చుకుంది.
ఇలావుంటే, ఆదివారం ఒక మ్యాచ్ జరుగుతుం ది. అందులో అర్జెంటీనా, దక్షిణ కొరియా జట్లు ఢీ కొంటాయ. మొదటి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి సంచలనం సృష్టించిన కొరియా మరో అసాధారణ ఫలితాన్ని నమోదు చేయడానికి సమాయత్తమవు తున్నది. అంతగా అనుభవం లేని అర్జెంటీనాకు ఈ మ్యాచ్‌ని ఒక పరీక్షగా చెప్పుకోవాలి.