క్రీడాభూమి

పిఎస్‌ఎల్‌లో ఫిక్సింగ్ వీరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 8: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి, నేరం రుజువుకావడంతో జైలు శిక్షను అనుభవించి, ఆపై సస్పెన్షన్ వేటును కూడా ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు సల్మాన్ బట్, మహమ్మద్ ఆసిఫ్ మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే దిశగా తొలి అడుగు వేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో వీరిద్దరికీ స్థానం లభించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆమోద ముద్ర వేయడంతో, వీరు త్వరలోనే జాతీయ జట్టులోకి వస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరితోపాటు స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలిన మహమ్మద్ అమీర్ ఇప్పటికే పాక్ జట్టులోకి వచ్చేసిన విషయం తెలిసిందే. మిగతా ఇద్దరికీ పిసిబి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, మహమ్మద్ ఆసిఫ్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. నిషేధ కాలం ముగిసిన తక్షణమే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడతామని, ఆ తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెడతామని వారిద్దరూ ఎన్నోసార్లు ధీమా వ్యక్తం చేసినప్పటికీ, ప్రపంచ దేశాలు ఏమంటాయోనన్న భయంతో పిసిబి వారి పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించలేదు. 2010లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు బట్, ఆసిఫ్‌తోపాటు, మహమ్మద్ ఆమీర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. మజర్ మాజిద్ మధ్యవర్తిగా వ్యవహరించి, స్పాట్ ఫిక్సింగ్‌ను ఖరారు చేయగా, బట్, ఆసిఫ్, ఆమీర్ సహకరించారు. ఆమీర్ మొదట్లోనే తన నేరాన్ని అంగీకరించాడు. జట్టుకు నాయకత్వం వహించిన బట్ ఆదేశాల మేరకే తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని తన నేరాన్ని అంగీకరిస్తున్నానని బ్రిటన్ క్రౌన్ కోర్టు ముందు వాంగ్మూలమిచ్చాడు. నేరం రుజువుకావడంతో ముగ్గురూ జైలు శిక్ష అనుభవించారు. అప్పుడు టీనేజరైన ఆమీర్ వయసును దృష్టిలో ఉంచుకొని, అతను నేరాన్ని అంగీకరించడాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు శిక్షను తగ్గించింది. బట్, ఆసిఫ్ జైలు శిక్షను పూర్తి చేసి స్వదేశానికి వచ్చారు. అప్పటికే పిసిబి వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. శిక్షాకాలం పూర్తికావడానికి ముందే ఆమీర్‌కు నేషనల్ క్రికెట్ అకాడెమీలో శిక్షణ పొందే అవకాశం లభించింది. అతను జాతీయ జట్టులోకి వస్తాడన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ పిసిబి అతనిని జాతీయ జట్టులోకి తీసుకుంది. దీనితో తమకు కూడా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం వస్తుందని ఆసిఫ్, ఆసిఫ్ ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు తెరపడే అవకాశాలు మెరుగుపడ్డాయ. పిఎస్‌ఎల్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడంతో, వీరిద్దరూ సాధ్యమైనంత త్వరలో జాతీయ జట్టులోకి వస్తారన్న వాదన వినిపిస్తున్నది. మొత్తం మీద ఫిక్సింగ్ హీరోలకు పిసిబి పెద్దపీట వేయడానికి ప్రయత్నించడం పట్ల క్రికెట్ ప్రపంచంలో జోరుగా చర్చ కొనసాగుతున్నది.

చిత్రం.. సల్మాన్ బట్ , మహమ్మద్ ఆసిఫ్