క్రీడాభూమి

‘చాంపియన్’ జీతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇటీవలే రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించిన ఏస్ షూటర్ జీతు రాయ్‌ని ‘చాంపియన్ ఆఫ్ ది చాంపియన్స్’గా అంతర్జాతీయ రైఫిల్స్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రకటించింది. ఈ విషయాన్ని భారత రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఎఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. కామనె్వల్త్ గేమ్స్, ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరచి, స్వర్ణ పతకాలను సాధించిన జీతు ఇటీవల జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్న విషయాన్ని రణీందర్ గుర్తుచేశాడు. అతని ప్రతిభకు గుర్తుగా ఐఎస్‌ఎస్‌ఎఫ్ అతనికి అరుదైన అవార్డుకు ఎంపిక చేసిందని తెలిపాడు.