క్రీడాభూమి

ఆసీస్ గెలుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 9: భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని ఒక పత్రికకు రాసిన వ్యాసంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ తక్కువగా ఉన్నారని పేర్కొన్నాడు. అదే విధంగా భారత జట్టులోని ఫాస్ట్ బౌలర్లు బంతి విపరీతంగా బౌన్స్ అయ్యే అవకాశం ఉన్న ఆసీస్ పిచ్‌లపై ఏవిధంగా రాణిస్తారన్నది అనుమానంగానే ఉందన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టుకు ఈ సిరీస్ సవాలుగా మారుతుందని జోస్యం చెప్పాడు. కాగితంపై చూస్తే భారత జాబితాలో హేమాహేమీలు ఎంతో మంది కనిపిస్తారని, కానీ, ఆసీస్‌ను ఢీకొని విజయాలను నమోదు చేసే సత్తా వారికి లేదని వ్యాఖ్యానించాడు. ఈఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా పోటీపడతాయని అన్నాడు. ఆ టోర్నీకి వామప్‌గా వనే్డ, టి-20 సిరీస్‌లు ఉపయోగపడతాయని ఇయాన్ చాపెల్ తెలిపాడు. టి-20 వరల్డ్ కప్ పోటీలకు ముందే భారత్‌ను చిత్తుచేయడం ద్వారా, ధోనీ బృందం ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమే ఆసీస్ లక్ష్యంగా కనిపిస్తున్నదని పేర్కొన్నాడు. ఈ కలను సాకారం చేసుకునే శక్తిసామర్థ్యాలు ఆసీస్ జట్టులో పుష్కలంగా ఉన్నాయని తెలిపాడు. మిచెల్ మార్ష్, గ్లేన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్, జేమ్స్ ఫాల్క్‌నెర్ తదితరులు వేగంగా పరుగులు చేయగల సమర్థులని అన్నాడు. భారత జట్టులో ఆల్‌రౌండర్లు లేని విషయాన్ని కూడా అతను గుర్తుచేశాడు. ఏ కోణంలో చూసినా భారత్‌పై ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు.
నేతల బిసిసిఐ
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లో ఎక్కువ మంది రాజకీయ పార్టీ నాయకులే ఉన్నారని ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించాడు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ భారత క్రికెట్‌లో నేతల హవా కొనసాగుతున్నదని అన్నాడు. నాయకుల జోక్యం ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. బిసిసిఐ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించాడు. అంపైర్ డిసిషన్ రివ్యూ విధానం (డిఆర్‌ఎస్)ను భారత్ తప్ప క్రికెట్ ఆడే అన్ని దేశాలు అమలు చేస్తున్నాయని గుర్తుచేశాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో బిసిసిఐ ఎప్పుడూ ఈ విధానం అమలుకు అంగీకరించలేదని చెప్పాడు. మొత్తం 11 మంది బౌలర్లు లేదా 11 మంది బ్యాట్స్‌మెన్‌తో ఒక జట్టును ఏ విధంగా తయారు చేసుకోలేమో, అదే విధంగా క్రికెట్ బోర్డు మొత్తాన్ని రాజకీయ నాయకులతోగానీ, పార్టీ ప్రతినిధులతోగానీ నింపకూడదని అన్నాడు.