క్రీడాభూమి

ప్రపంచ కప్ కబడ్డీ అర్జెంటీనాపై భారత్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 15: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడిన భారత్ సునా యాసంగా గెలిచింది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ రంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన భారత ఆటగాళ్లు పాయంట్లు కొల్ల గొట్టారు. ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 36-13 తేడాతో పటి ష్టమైన స్థితికి చేరింది. ద్వితీయార్ధంలోనూ అదే ఒరవడిని కొనసాగించి, మ్యాచ్‌ని 74-20 గా ముగించింది. 54 పాయంట్ల తేడాతో గెలిచిన భారత్‌కు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఇదే భారీ విజయం. భారత్ తరఫున అజయ్ ఠాకూర్ (14), రాహుల్ చౌదరీ (11) సూపర్ టెన్‌ను సాధించారు. అర్జెంటీనా ఆట గాడు నహుయెల్ ఎనిమిది పాయంట్లు చేసి, కేవలం రెండు పాయంట్ల తే డాతో సూపర్ టెన్‌ను కోల్పోయాడు.
తిరుగులేని దక్షిణ కొరియా
ఈ టోర్నమెంట్‌లో దక్షిణ కొరియా జైత్ర యాత్రను కొనసాగిస్తున్నది. శనివారం నాటి తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 63-25 తేడాతో చిత్తు చేసిం ది. కాగా, చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో జాపన్‌పై ఇరాన్ 38-34 పాయంట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు చివ రి వరకూ తీవ్రంగా పోరాటం సాగించాయ.