క్రీడాభూమి

బిసిసిఐ మొండిపట్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, అక్టోబర్ 15: లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేస్తే, దేశ క్రికెట్ రంగాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతున్న తన ఉనికి లే కుండా పోతుందన్న భయంతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మొండి వైఖరిని కొనసాగిస్తున్నది. సోమవారం సుప్రీం కోర్టుకు దా ఖలు చేయాల్సిన అఫిడవిట్‌లో ఏఏ అంశాలను పొందుపరచాలనే విష యాన్ని చర్చించడానికి శనివారం ఇక్కడ సమావేశమైన బిసిసిఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ము గిసింది. లోధా కమిటీలోని కొన్ని అంశాలు ఆచరణకు యోగ్యంగా లేవ న్న పాతపాటనే మరోసారి వినిపించింది. సిఫార్సులను అమలుచేసి తీ రాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఇరకాటంలో పడిన బిసి సిఐ చివరి అస్త్రంగా కౌంటర్ అఫిడవిట్‌ను సోమవారం దాఖలు చేయ నుంది. అయతే, అందులో కొత్త అంశాలను ప్రస్తావించకుండా గతంలో చేసిన వాదనలనే మరోసారి వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచా రం. సోమవారం కోర్టుకు సమర్పించే అఫిడవిట్‌లో ఏవైనా కొత్త అంశా లు ఉంటాయన్న అభిప్రాయానికి తెరపడింది. ఆధిపత్యాన్ని వదులుకోవ డానికి ఏమాత్రం ఇష్టపడని బిసిసిఐ మొండిగానే ముందుకు వెళుతున్న ది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్ని విధాలా నచ్చ చెప్పినా పట్టించుకోని బిసిసిఐ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.