క్రీడాభూమి

జాతీయ భావాన్ని ప్రతిబింబిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 9: జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణతో ప్రాంతీయ భావాలను పారదోలి దేశవ్యాప్తంగా ఉన్న 120కోట్ల మంది ప్రజల్లో జాతీయ భావాన్ని ప్రతిబింబిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ జాతీయ గ్రామీణ క్రీడా పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ క్రీడలు భాషా భేదాలకు అతీతంగా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. మరుగున పడిపోతున్న ప్రాచీన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన బాలురకు విలువిద్యలో, మత్స్యకారుల పిల్లలకు స్విమ్మింగ్‌లో శిక్షణను అందించి ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఆణిముత్యాలుగా నిలుస్తారన్నారు. రైల్వేస్టేషన్‌లో చాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న కృషి, పట్టుదలను యువత అందిపుచ్చుకుని ముందుకు సాగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పలువురు అధికారులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్రీడాజ్యోతిని వెలిగించి జాతీయ క్రీడలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

కాలి గాయంతో
షమీ అవుట్
భువీకి ఆహ్వానం
పెర్త్, జనవరి 9: పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే వనే్డ సిరీస్‌కు దూరంకాగా, అతని స్థానంలో జట్టుతో చేరాల్సిందిగా భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు ఆహ్వానం పంపారు. ఈనెల 12 నుంచి మొదలయ్యే వనే్డ సిరీస్‌కు ఎంపికైన షమీ ఎడమకాలి కండరాలు బెణకడంతో విశ్రాంతి అత్యవసరమైంది. అతను కనీసం నాలుగు నుంచి ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీనితో అతని స్థానంలో భువీని సెలక్టర్లు ఎంపిక చేశారు.

సమీకి దక్కని
కాంట్రాక్టు
సెయింట్ జాన్స్ (అంటీగువా), జనవరి 9: వెస్టిండీస్ టి-20 జట్టు కెప్టెన్ డారెన్ సమీకి కాంట్రాక్టుల విషయంలో నిరాశే ఎదురైంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించిన తాజా కాంట్రాక్టుల్లో అతనికి స్థానం దక్కలేదు. ఈ సెంట్రల్ కాంట్రాక్టులో ఆల్‌రౌండర్లు డ్వెయిన్ బ్రేవో, ఆండ్రె రస్సెల్ పేర్లు కూడా లేకపోవడం గమనార్హం. గత ఏడాది నవంబర్ మాసంలో శ్రీలంకపై సమీ చివరిగా టి-20 మ్యాచ్ ఆడాడు. జెర్మెయిన్ బ్లాక్‌వుడ్, లియోన్ జాన్సన్, షేన్ డౌరిచ్, షై హోప్, రాజేంద్ర చంద్రిక వంటి యువ ఆటగాళ్లకు కూడా కాంట్రాక్టును కట్టబెట్టిన విండీస్ బోర్డు సమీ, డ్వెయిన్ బ్రేవో, రస్సెల్, సులేమాన్ బెన్, శివనారైన్ చందర్‌పాల్ వంటి సీనియర్లకు మొండిచేయి చూపడం గమనార్హం. తాజా కాంక్ట్రాక్టు ఈఏడాది సెప్టెంబర్ మాసం వరకూ అమల్లో ఉంటుంది.