క్రీడాభూమి

విండీస్‌పై పాకిస్తాన్‌కు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 16: వెస్టిండీస్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ 222 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈ జట్టు అజర్ అలీ సూపర్ ట్రిపుల్ సెంచరీతో రాణించడంతో మూడు వికెట్లకు 579 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించి 357 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టులో డారెన్ బ్రేవో (87), మార్లొన్ శామ్యూల్స్ (76) మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి కనీస ప్రతిఘటన కూడా లేకపోవడంతో విండీస్‌కు భారీ లోటు తప్పలేదు.