క్రీడాభూమి

భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, అక్టోబర్ 16: టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లోనూ బోణీ చేసింది. ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ మైదానంలో జరిగిన మొదటి వనే్డను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకుంది. కివీస్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ ఓపెనర్‌గా దిగి, చివరి వరకూ అవుట్ కాకుండా ఒంటరి పోరాటం సాగించడం, భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయంగా 85 పరుగులు సాధించడం ఈ మ్యాచ్‌లోని ప్రధానాంశాలు. భారత పేసర్ల ధాటికి బెంబేలెత్తిన న్యూజిలాండ్ అతి కష్టం మీద 190 పరుగులు చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఇంగా 101 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం విశేషం.
టాస్ గెలిచిన ధోనీ
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బౌలర్లు అండగా నిలిచాడు. కేవలం 14 పరుగుల స్కోరువద్ద మార్టిన్ గుప్టిల్ (12)ను రోహిత్ శర్మ క్యాచ్ పట్టగా, హార్దిక్ పాండ్య అవుట్ చేయడంతో ఆరంభమైన కివీస్ పతనం ఆరంభమైంది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్‌ను కాపాడుకుంటూ ఆడినప్పటికీ, మిగతా వారి నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ తొమ్మిది బంతుల్లో కేవలం మూడు పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అమిత్ మిశ్రాకు చిక్కాడు. 29 పరుగుల వద్ద రెండో వికెట్ కూలగా, మరో నాలుగు పరుగులకే మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (0) కూడా పెవిలియన్ చేరాడు. ఉమేష్ వేసిన బంతి అతని బ్యాట్ అంచులకు తగులుతూ వికెట్‌కీపింగ్ చేస్తున్న ధోనీ చేతుల్లోకి వెళ్లింది. మరో ప్రధాన బ్యాట్స్‌మన్ కొరీ ఆండర్సన్, టెస్టు సిరీస్‌లో చెప్పుకోదగ్గ ఆటతో రాణించిన ల్యూక్ రోన్చీ సైతం విఫలమయ్యారు. మిడ్ వికెట్ స్థానంలో ఉమేష్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఆండర్సన్ (4) అవుటయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొన్న రోన్చీ పరుగుల ఖాతా తెరవకుండానే హర్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఉమేష్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జిమీ నీషమ్ (10), మిచెల్ సాంట్నర్ (0), డౌగ్ బ్రాస్‌వెల్ (15) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. 106 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు లాథమ్‌తో కలిసి టెయిల్ ఎండర్ టిమ్ సౌథీ ప్రయత్నించాడు. అతను 45 బంతలు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు సాధించి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో మనీష్ పాండే క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. ఇష్ సోధీ (1)ని అమిత్ మిశ్రా ఎల్‌బిగా పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. క్రీజ్‌లో పాతుకుపోయి నాటౌట్‌గా నిలిచిన లాథమ్ 98 బంతులు ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, అమిత్ మిశ్రా చెరి మూడు, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్ చెరి రెండు చొప్పున వికెట్లు సాధించారు.
సూపర్ కోహ్లీ
సూపర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ భారత్ విజయాన్ని సులభతరం చేసింది. రోహిత్ శర్మ 14 పరుగులు చేసి డౌగ్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుట్‌కాగా, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ నిలకడగా ఆడాడు. ఆజింక్య రహానే 34 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసి జిమీ నీషమ్ బౌలింగ్‌లో ల్యూక్ రోన్చీ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. మనీష్ పాండే (17), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (21) కూడా తక్కువ పరుగులకే అవుటయ్యారు. భారత్ నాలుగు వికెట్లు చేజార్చుకొని, లక్ష్యాన్ని చేరే సమయానికి కోహ్లీ 81 బంతుల్లో 85 (తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), కేదార్ జాదవ్ 12 బంతుల్లో 10 (రెండు ఫోర్లు) నాటౌట్‌గా ఉన్నారు.

డే/నైట్ వనే్డ ఇంటర్నేషనల్స్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ అర్ధ శతకాన్ని సాధించడం 70 ఇన్నింగ్స్‌లో ఇది 32వ సారి.
‘లెజెండరీ క్రికెటర్’ సచిన్ తెండూల్కర్ 107 ఇన్నింగ్స్‌లో 34 పర్యాయాలు ఈ ఫీట్‌ను సాధించాడు.

చిత్రం.. విరాట్ కోహ్లీ