క్రీడాభూమి

‘శాగ్’ బాడ్మింటన్‌పై వీడని ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, జనవరి 9: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భాగంగా బాడ్మింటన్ పోటీలపై ఉత్కంఠ నెలకొంది. ఈ పోటీలకు అస్సాం, మణిపూర్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. తొలుత షిల్లాంగ్‌కు కేటాయించిన బాడ్మింటన్ పోటీలను ఆతర్వాత గువహతికి తరలించడాన్ని మణిపూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే, వచ్చేనెల జరిగే ‘శాగ్’ క్రీడలకు అస్సాంతో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే బాధ్యత నుంచి వైదొలగుతామని హెచ్చరించింది. కాగా, సోమవారం జరిగే శాగ్ కార్యవర్గ సమావేశంలో పాల్గొనరాదని నిర్ణయించినట్టు సమాచారం. కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న శాగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మేఘాలయ క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అక్కడి ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కూడా సభ్యులే. అయితే, బాడ్మింటన్ పోటీలను షిల్లాంగ్ నుంచి తప్పించి, గువహతికి తరలించడాన్ని నిరసిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరు కావద్దని వారిని మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ఆదేశించినట్టు తెలుస్తున్నది. పరిస్థితిని సమీక్షించి, తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే శాగ్ క్రీడలను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని మేఘాలయ ఇప్పటికే తేల్చిచెప్పింది.