క్రీడాభూమి

డబ్ల్యుటిఎ ఫైనల్స్‌కు సెరెనా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెలిస్, అక్టోబర్ 17: త్వరలో సింగపూర్‌లో ప్రారంభం కానున్న ఎలైట్ డబ్ల్యుటిఎ ఫైనల్స్ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రకటించింది. ఈ ఏడాదంతా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన భుజం గాయాల నుంచి తాను ఇంకా కోలుకోలేదని, అందుకే ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నానని ఆమె వివరించింది. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ నుంచి సెరెనా వైదొలిగినట్లు ‘ట్విట్టర్’ ద్వారా డబ్ల్యుటిఎ (ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్) వెల్లడించింది. అంతేకాకుండా ఇందుకు కారణాలను వివరిస్తూ సెరెనా పంపిన వీడియో సందేశాన్ని కూడా ట్విట్టర్‌లో డబ్ల్యుటిఎ పోస్టు చేసింది. ‘ఈ ఏడాది పోటీలో పాల్గొనలేకపోతున్నానని సింగపూర్‌లోని టెన్నిస్ అభిమానులకు తెలియజేసేందుకు విచారిస్తున్నా. భుజానికి తగిలిన గాయాల నుంచి కోలుకోలేకపోవడం వల్లనే ఈ ఈవెంట్ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నా. ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ గాయాలు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి కోలుకునే వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని సెరెనా ఆ వీడియోలో పేర్కొంది. కెరీర్‌లో 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి చరిత్ర సృష్టించిన సెరెనా విలియమ్స్ ఈ ఏడాది యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో ఓటమి పాలైన తర్వాత చైనాలో రెండు టోర్నమెంట్లకు దూరమైన విషయం తెలిసిందే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 186 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగిన సెరెనాకు యుఎస్ ఓపెన్ సెమీ ఫైనల్‌లో ఎదురైన ఓటమితో ర్యాంకింగ్స్‌లో ఆమె కిందికి దిగజారగా, ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకున్న జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఒకే ఒక్క గ్రాండ్ శ్లామ్ టైటిల్‌తో సరిపుచ్చుకున్న సెరెనాను అప్పటి నుంచి భుజం గాయాలు తీవ్రంగా వేధిస్తుండటంతో రియో ఒలింపిక్స్‌లో ఆమె మూడో రౌండ్‌లోనే ఒటమిపాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో ఐదోసారి పసిడి పతకం సాధించాలన్న సెరెనా ఆశలు నీరుగారి పోయాయి.