క్రీడాభూమి

టైసన్ గే కుమార్తె దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెక్సింగ్టన్, అక్టోబర్ 17: తుపాకీ సంస్కృతి అణువణువునా జీర్ణించుకున్న అమెరికాలో మరో దారుణం జరిగింది. ఒలింపిక్ స్ప్రింటర్ టైసన్ గే కుమార్తె ట్రినిటీ గే ఈసారి ఈ సంస్కృతికి బలైపోయింది. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో మెడపై తీవ్రగాయాలైన ట్రినిటీ గే కెంటకీ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ తుది ప్రాణాలు విడిచింది. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపి) వార్తా సంస్థకు పంపిన సంక్షిప్త సందేశంలో టైసన్ గే ఏజెంట్ మార్క్ వెట్‌మోర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటంతో పాటు ఆ ఆయుధంతో ట్రినిటీ గేపై కాల్పులు జరిపినందుకు డెవోంటా మిడిల్‌బ్రూక్స్ (21) అనే యువకుడిని అరెస్టు చేసి అతనిపై అభియోగాలు నమోదు చేసినట్లు అమెరికా పోలీసులు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు మిడిల్‌బ్రూక్స్ కెంటకీ యూనివర్శిటీకి సమీపంలోని ఒక రెస్టారెంట్ వద్ద గల పార్కింగ్ ప్రదేశంలో ఉన్నాడని, ట్రినిటీ గేపై అతను తుపాకీతో పలు రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరో వ్యక్తిని కూడా ప్రశ్నించినప్పటికీ అతనిపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయలేదు.
ముద్దుల కుమార్తె ట్రినిటీ గేతో
ఒలింపిక్ స్ప్రింటర్ టైసన్ గే (ఫైల్ ఫొటో)