క్రీడాభూమి

విండీస్‌ను ఆదుకున్న బ్రావో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 17: దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ (డే/నైట్) మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రావో అజేయ సెంచరీతో రాణించి తమ జట్టును ఆదుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు విజయం దిశగా పయనిస్తోంది. 346 పరుగుల లక్ష్యంతో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (6) స్వల్ప స్కోరుకే నిష్క్రమించగా, మరో ఓపెనర్ లియోన్ జాన్సన్ 47 పరుగులు సాధించి వెనుదిరిగాడు. ఈ తరుణలో బ్రావో క్రీజ్‌లో నిలదొక్కుకుని పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించినప్పటికీ మర్లాన్ శామ్యూల్స్ (4)తో పాటు జెర్మయిన్ బ్లాక్‌వుడ్ (15) కూడా త్వరత్వరగానే పెవిలియన్‌కు పరుగెత్తారు. అయితే ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన తర్వాత రోస్టన్ చేజ్ (35) యాసిర్ షా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించగా, అతని స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ షేన్ డౌరిచ్ (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే వెనుదిరిగాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా సెంచరీతో రాణించిన డారెన్ బ్రావో (116) కెప్టెన్ జాసన్ హోల్డర్ (22)తో కలసి 68 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో కడపటి వార్తలు అందే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 262 పరుగులు సాధించిన వెస్టిండీస్ జట్టు ఇంకా విజయానికి 84 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు పాక్ 3 వికెట్ల నష్టానికి 579 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 357 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఘోరంగా విఫలమై 123 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్ దేవేంద్ర బిషూ 49 పరుగులకే 8 వికెట్లు కూల్చి రెండో ఇన్నింగ్స్‌లో పాక్ వెన్ను విరిచాడు.