క్రీడాభూమి

డోపింగ్‌లో నర్సింగ్ వైఫల్యంపై సిబిఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: డోపింగ్ పరీక్షలో విఫలమవడంపై న్యాయాన్ని పొందేందుకు అంతర్జాతీయ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద బలం చేకూరింది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) మంగళవారం కేసు నమోదు చేసింది. తొలుత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారులతో ఘర్షణకు, ఆ తర్వాత అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు విధించిన నిషేధం కారణంగా రియో ఒలింపిక్స్‌లో ఒక రోజు ముందే బౌట్ నుంచి దూరమయ్యేందుకు దారితీసిన ఈ కేసుపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని నర్సింగ్ యాదవ్ ఎప్పటి నుంచో కోరుతున్నాడు. సోనేపట్ (హర్యానా)లోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో తనపై ఎవరో కుట్ర పన్ని ఆహారంలో నిషేధిత ఉత్ప్రేరకాలను కలపడం వల్లనే డోపింగ్ పరీక్షలో విఫలమయ్యానని నర్సింగ్ యాదవ్‌తో పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) ఆది నుంచీ వాదిస్తున్న విషయం విదితమే. ఈ వాదన నిజమని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు ఏమీ లేవని పేర్కొంటూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) నర్సింగ్ యాదవ్‌పై నిషేధం విధించడంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అతను చివరి నిమిషంలో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై డోపింగ్ పరీక్షలో నర్సింగ్ యాదవ్ విఫలమవడానికి దారితీసిన కారణాలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. దీంతో ప్రస్తుతం ఈ అంశాన్ని సిబిఐకి నివేదించారు.