క్రీడాభూమి

రెండో వామప్‌లోనూ భారత్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 9: వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో ఆదివారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయభేరి మోగించింది. రోహిత్ శర్మ, మనీష్ పాండే అర్ధ శతకాలతో రాణించగా, 249 పరుగులు చేయగలిగిన భారత్ ఆతర్వాత వెస్టర్న్ ఆస్ట్రేలియాను 185 పరుగులకే ఆలౌట్ చేసి 64 పరుగుల తేడాతో గెలిచింది. ఒక్కో జట్టు తరఫున గరిష్టంగా 14 మంది ఆటగాళ్లుకు అవకాశం ఉన్నప్పటికీ, మైదానంలో 11 మంది మాత్రమే ఉండాలన్న నిబంధన కింద జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగిన 49.1 ఓవర్లలో 249 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 67 (82 బంతులు/ ఆరు ఫోర్లు/ మూడు సిక్సర్లు), మనీష్ పాండే 58 (59 బంతులు/ మూడు ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించగా, ఆజింక్య రహానే 53 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేదు. వెస్టర్న్ ఆస్ట్రేలియా బౌలర్లలో డ్రూ పోర్టర్ 37 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 250 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టర్న్ ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. జేక్ కార్డర్ (45), జెరోమ్ మోర్గాన్ (50) తప్ప మిగతా వారు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో రిషీ ధావన్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్‌కు తలా రెండు వికెట్లు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 49.1 ఓవర్లలో 249 ఆలౌట్ (రోహిత్ శర్మ 67, రహానే 47, మనీష్ పాండే 58, పోర్టర్ 5/37).
వెస్టర్న్ ఆస్ట్రేలియా: 49.2 ఓవర్లలో 185 ఆలౌట్ (కార్డర్ 45, మోర్గాన్ 50, రిషీ ధావన్ 2/28, జడేజా 2/38, అశ్విన్ 2/32, అక్షర్ పటేల్ 2/29).

రవోనిక్‌తో
ఫెదరర్ పోరు
బ్రిస్బేన్, జనవరి 9: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఎమీ ఫైనల్‌లో అతను ఎనిమిదో సీడ్ డొమినిక్ థియెమ్‌పై 6-1, 6-4 తేడాతో గెలుపొందాడు. కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న ఫెదరర్ ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌తో గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల వేటను కొనసాగించనున్నాడు. కాగా, బ్రిస్బేన్ ఫైనల్‌లో అతను రవోనిక్‌తో తలపడతాడు. మరో సెమీ ఫైనల్‌లో రవోనిక్ 7-6, 7-6 స్కోరుతో థామస్ బెర్డిచ్‌పై అతి కష్టం మీద విజయం సాధించి ఫైనల్ చేరాడు.