క్రీడాభూమి

సానియా, హింగిస్ జోడీకి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, జనవరి 9: ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ ఓపెన్ ఇంటర్నేషనల్ డబ్ల్యుటిఎ ఫైనల్‌లో సానియా, హింగిస్ జోడీ 7-5, 6-1 తేడాతో ఏంజెలిక్ కెర్బర్, ఆండ్రియా పెట్కోవిచ్ జోడీపై సులభంగా గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న సానియా, హింగిస్‌కు తొలి సెట్‌లో కెర్బర్, పెట్కోవిచ్ జోడీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆ సెట్‌ను సాధించడానికి చెమటోడ్చినప్పటికీ రెండో సెట్‌లో పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది మొదటి టైటిల్‌ను సానియా, హింగిస్ జోడీ సొంతం చేసుకుంది. ఈ జోడీకి ఇది వరుసగా ఆరో టైటిల్. యుఎస్ ఓపెన్, గాంగ్జూ, ఉహాన్, బీజింగ్ టెన్నిస్ టోర్నీలతోపాటు డబ్ల్యుటిఎ ఫైనల్స్ టోర్నీలోనూ గెలిచిన ఈ జోడీ వరుసగా ఆరో టైటిల్‌ను అందుకుంది.
‘అజేయ’ రికార్డు
ఎక్కువ వరుస మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసిన రికార్డును కూడా సానియా, హింగిస్ జోడీ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో వీరిద్దరూ 26 వరుస విజయాలను సాధించారు. 2012లో సారా ఎరానీ, రాబర్టా విన్సీ 25 వరుస విజయాలతో నెలకొల్పిన రికార్డును శనివారం నాటి బ్రిస్బేన్ ఫైనల్‌లో విజయభేరి మోగించడం ద్వారా సానియా, హింగిస్ జోడీ అధిగమించింది.
సింగిల్స్ విజేత అజరెన్కా
బ్రిస్బేన్: బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను విక్టోరియా అజరెన్కా గెల్చుకుంది. ఆమె ఫైనల్‌లో ఆమె ఏంజెలిక్ కెర్బర్‌ను 6-3, 6-1 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ అజరెన్కా విజృంభణ కొనసాగింది.
chitram..
సానియా మీర్జా, మార్టినా హింగిస్