క్రీడాభూమి

రూపీందర్ డబుల్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాన్‌టన్ (మలేసియా), అక్టోబర్ 20: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. గురువారం తన తొలి మ్యాచ్‌లో జపాన్‌ను ఢీ కొన్న భారత్‌కు రూపీందర్‌పాల్ సింగ్ విజృంభణ అండగా నిలిచింది. అతను డబుల్ హ్యాట్రిక్‌తో రాణించగా, భారత్ 10-2 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే రమణ్‌దీప్ సింగ్ తొలి గోల్ చేయగా, 9, 12 నిమిషాల్లో రూపీందర్ రెండు వరుస గోల్స్ సాధించాడు. 15వ నిమిషంలో రమణ్‌దీప్ మరో గోల్ చేసి, భారత్ ఆధిక్యాన్ని 4-0కు చేర్చాడు. మరో రెండు నిమిషాల్లోనే రూపీందర్ తన ఖాతాలో మూడో గోల్‌ను వేసుకున్నాడు. 19వ నిమిషంలో తల్వీందర్ సింగ్ ద్వారా భారత్‌కు గోల్ లభించగా, 22వ నిమిషంలో రూపీందర్ తన నాలుగో గోల్‌ను నమోదు చేశాడు. దీనితో 7-0 ఆధిక్యానికి వెళ్లిన భారత్ దాడులను ఉపసంహరించుకొని, సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని దొర్లించే ప్రయత్నం చేసింది. అయితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న జపాన్ ఆటగాడు తనకా కెంటా తన జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. మరో 15 నిమిషాల తర్వాత ఒచియా హిమొర్మసా మరో గోల్ చేశాడు. జపాన్ వరుసగా రెండు గోల్స్ సాధించడంతో భారత్ మరోసారి దాడులకు దిగింది. రూపీందర్ రెండు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేయగా, అల్ఫాన్ యూసుఫ్ భారత్‌కు చివరిదైన పదో గోల్‌ను సాధించిపెట్టాడు. అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన భారత్ భారీ తేడాతో గెలుపొంది సత్తాను నిరూపించుకుంది.
పాకిస్తాన్‌కు మలేసియా షాక్
తొలి మ్యాచ్‌లో పటిష్టమైన పాకిస్తాన్‌కు ఆతిథ్య దేశం మలేసియా షాకిచ్చింది. 4-2 తేడాతో విజయభేరి మోగించింది. మ్యాచ్ 13వ నిమిషంలోనే అషారీ ఫిర్హాన్ ద్వారా మలేసియాకు తొలి గోల్ లభించగా, మరో ఐదు నిమిషాల్లోనే పాకిస్తాన్ ఆటగాడు బిలావల్ మహమ్మద్ అలీం ఈక్వెలైజర్‌ను అందించాడు. ఈ గోల్ లభించిన తర్వాత దాడులను కొనసాగించిన పాకిస్తాన్‌కు అతనే 34వ నిమిషంలో మరో గోల్‌ను సాధించిపెట్టాడు. దీనితో పాక్ 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లిందిగానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మూడు నిమిషాల వ్యవధిలోనే సరీ ఫైజల్ ద్వారా మలేసియాకు ఈక్వెలైజర్ లభించింది. 41వ నిమిషంలో సాబా షరిల్ గోల్ చేయగా, 60వ నిమిషంలో సరీ ఫైజల్ తన ఖాతాలో రెండో గోల్‌ను వేసుకున్నాడు. మూడు వరుస గోల్స్‌తో 4-2 ఆధిక్యానికి దూసుకెళ్లిన మలేసియా అదే తేడాతో విజయం సాధించింది.