క్రీడాభూమి

ఏం చేస్తారో చూద్దాం విశ్రాంత న్యాయమూర్తి లోధా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తరుణంలో తమ సిఫార్సులను అమలు చేయడంపై బిసిసిఐ అధికారులు ఏం చేస్తారో చూద్దామని విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అన్నారు. అతని ఆధ్వర్యంలోనే సుప్రీం కోర్టు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను అమలు చేసేందుకు బిసిసిఐ వెనకాడుతున్నది. బోర్డు తీరుపై శుక్రవారం సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందిస్తూ సభ్య సంఘాలకు చెల్లింపులను స్తంభింప చేసింది. ఆయా క్రికెట్ సంఘాలు లోధా సిఫార్సులను అమలు చేస్తున్నట్టు అంగీకరించి, తగిన చర్యలు తీసుకున్న తర్వాత ఆయా మొత్తాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కమిటీ సిఫార్సులను డిసెంబర్ 3వ తేదీలోగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలపై విలేఖరులు ప్రశ్నించగా, వాటిని బోర్డు ఎంత వరకూ అమలు చేస్తుందో చూద్దామని లోధా అన్నారు.
చర్చలకు సిద్ధం
సిఫార్సుల్లోని కొన్ని అంశాలు ఆచరణకు సాధ్యం కావని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చేస్తున్న వాదనపై లోధా స్పందించారు. ఒకవేళ ఠాకూర్ వస్తే, అతనితో చర్చించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని అన్నాడు. ఈ ఏడాది జూలై 18వ తేదీలోపే తమ కమిటీ సిఫార్సులను బిసిసిఐ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇన్నాళ్లూ తాత్సారం చేసిందని వ్యాఖ్యానించారు. ఏ విషయాన్నయినా బోర్డుతో చర్చించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

డిఆర్‌ఎస్‌కు
గ్రీన్ సిగ్నల్!
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: అంపైర్ డిసిషన్ రివ్యూ విధానం (డిఆర్‌ఎస్)కు బిసిసిఐ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నాళ్లూ డిఆర్‌ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన బిసిసిఐపై రోజురోజుకూ ఒత్తిడి పెరగడంతో ఇంగ్లాండ్‌తో వచ్చేనెల నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్‌లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని బిసిసిఐ ప్రకటించింది. ఫలితాలను బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే డిఆర్‌ఎస్‌కు సానుకూలత వ్యక్తం చేశాడు. చాలా మంది అతనికి మద్దతు పలికారు. దీనికితోడు డిఆర్‌ఎస్‌ను అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పదేపదే సూచిస్తున్నది. భారత్‌తో సిరీస్‌లు ఆడుతున్న దేశాలు కూడా పరోక్షంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అన్ని వైపులా డిఆర్‌ఎస్ అమలుకు ఒత్తిడి పెరగడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో బిసిసిఐ దీనికి సానుకూంలగా స్పందించింది.

సుప్రీం ఆదేశాలు
మాకు అందలేదు
బిసిసిఐ అధ్యక్షుడు ఠాకూర్
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ సభ్య సంఘాలకు చెల్లింపులను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై వ్యాఖ్యానించడానికి బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ నిరాకరించాడు. కోర్టు ఆదేశాల కాపీ తనకు అందలేదని, కాబట్టి ఇప్పుడే ఆలాంటి వ్యాఖ్యలు చేయలేనని అన్నాడు. అది అందిన వెంటనే స్పందిస్తానని తెలిపాడు. న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం ఉందని, సుప్రీం కోర్టు ఆదేశాలు అందిన వెంటనే లోధా సిఫార్సుల అమలుపై సభ్య సంఘాలతో చర్చిస్తామని అన్నాడు. వాటిని అమలు చేయాల్సిందిగా సంఘాలను కోరుతామని చెప్పాడు.

ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్
పుణెలో తొలి మ్యాచ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది జరిగే జరిగే నాలుగు మ్యాచ్‌ల బార్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ పుణెలో ప్రారంభమవుతుంది. అక్కడి సుబ్రతారాయ్ సహారా స్టేడియంలో ఫిబ్రవరి 23 నుంచి మొదటి టెస్టు ఆరంభమవుతుందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో శ్రీలంక పర్యటనను ముగించుకున్న మరుసటి రోజే ఆస్ట్రేలియాతో సిరీస్ మొదలుకానుండడం విశేషం. రెండో టెస్టు బెంగళూరులో, మూడో టెస్టు రాంచీలో, చివరిదైన నాలుగో టెస్టు ధర్మశాలలో జరుగుతాయని బిసిసిఐ ప్రకటించింది. పుణె, రాంచీ, ధర్మశాల స్టేడియాల్లో ఇప్పటి వరకూ టెస్టులు జరగలేదు. మొదటిసారి లాంగర్ వర్షన్‌లో మ్యాచ్‌లు ఈ మూడు పట్టణాల్లో జరుగుతాయి. ఇంతకు ముందు భారత్‌లో పర్యటించినప్పుడు ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను 0-4 తేడాతో చేజార్చుకుంది. మరోసారి ఆసీస్‌ను టీమిండియా వైట్‌వాష్ వేసే అవకాశాలున్నాయి.