క్రీడాభూమి

సబ్‌స్టిట్యూట్ బ్యాట్స్‌మన్‌గా లార్కిన్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 22: క్రికెట్ చరిత్రలో తొలి సబ్‌స్టిట్యూట్ బ్యాట్స్‌మన్‌గా నిక్ లార్కిర్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలో వనే్డ ఎలిమినేషన్ కప్ ఫైనల్‌లో విక్టోరియాతో తలపడినప్పుడు డానియల్ హ్యూస్‌కు బదులు బ్యాటింగ్‌కు సబ్‌స్టిట్యూట్‌గా ఎంపికైన న్యూ సౌత్‌వేల్స్ ఆటగాడు లార్కిన్ ఈ ఘనతను అందుకున్నాడు. క్రికెట్‌లో ఒక ఆటగాడు అనారోగ్యం లేదా మరే ఇతర కారణాలతోనైనా మైదానంలోకి దిగకపోతే, అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు వస్తాడు. అయితే, సబ్‌స్టిట్యూట్ కేవలం ఫీల్డింగ్‌కు మాత్రమే పరిమితమవుతుంది. కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఇటీవల నిబంధనలను మార్చేసింది. బంతి హెల్మెట్‌కు బలంగా తగలడంతో ఒక బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ చేయలేకపోతే, అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ను పంపవచ్చన్న కొత్త నిబంధనను చేర్చింది. శనివారం నాటి మ్యాచ్‌లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న టెస్టు పేసర్ పీటర్ సిడిల్ వేసిన బంతి డానియల్ హ్యూస్ హెల్మెట్‌కు తగిలింది. దెబ్బ ధాటికి కింద కూలబడిన అతనిని వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, అతని స్థానంలో లార్కిన్ పేరును సబ్‌స్టిట్యూట్ బ్యాటింగ్‌కు న్యూ సౌత్‌వేల్స్ ప్రకటించింది. కానీ, వర్షం కారణంగా ఆట నిలిచిపోవడంతో లార్కిన్ బ్యాటింగ్‌కు దిగాల్సిన అవసరం రాలేదు. ఆ మ్యాచ్‌ని న్యూ సౌత్‌వేల్స్ 31 పరుగుల తేడాతో గెల్చుకుంది.

చిత్రం..బంతి హెల్మెట్‌కు బలంగా తగలడంతో పిచ్‌పైనే కూలబడిన
డానియల్ హ్యూస్ (ఇన్‌సెట్‌లో) నిక్ లార్కిన్