క్రీడాభూమి

హామిల్టన్‌కు రోజ్‌బెర్గ్ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్టిన్ (టెక్సాస్), అక్టోబర్ 22: చాలాకాలంగా బద్ధ శత్రువుల్లా ఆధిపత్య పోరాటాన్ని కొననసాగిస్తున్న మెర్సిడిజ్‌కు డ్రైవర్లు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోజ్‌బెర్గ్ ఆదివారం ఇక్కడ జరిగే యుఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌లో మరోసారి అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ చాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని అనుకుంటున్న హామిల్టన్‌ను రోజ్‌బెర్గ్ భయం వెంటాడుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 17 రేసులు జరగ్గా, రోజ్‌బెర్గ్ తొమ్మిది టైటిళ్లు సాధించాడు. హామిల్టన్ ఆరు రేసుల్లో గెలిచాడు. యుఎస్ గ్రాండ్ ప్రీ సహా ఇంకా నాలుగు రేసులు జరగాల్సి ఉంది. వీటిలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి నంబర్ వన్ స్థానంలో కొనసాగాలన్న ఆశ ఉన్నప్పటికీ రోజ్‌బెర్గ్ దూకుడును ఏ విధంగా అడ్డుకోవాలన్నది హామిల్టన్‌కు అర్థం కావడం లేదు. తన జట్టు నుంచే ఈ స్థాయి పోటీని అతను ఊహించలేదు. తన కంటే 33 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న రోజ్‌బెర్గ్‌ను అధిగమించాలంటే, చివరి నాలుగు రేసుల్లో హామిల్టన్ సర్వశక్తులు ఒడ్డక తప్పదు. యుఎస్ ఓపెన్ రేసు ఫలితాన్ని బట్టి నంబర్ వన్ హోదా ఎవరికి దక్కుతుందో స్పష్టమవుతుంది.