క్రీడాభూమి

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 22: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగబోయే మ్యాచ్ ఉత్కంఠ రేపుతున్నది. ఇరు దేశాల సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో జరగుతున్న ఈ మ్యాచ్‌పైనే అభిమానులు దృష్టి సారిస్తున్నారు. క్రికెట్ లేదా కబడ్డీ, ఫుట్‌బాల్ లేదా హాకీ.. భారత్, పాక్ మధ్య జరిగే ఏ పోరులోనైనా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఆయా టోర్నీల్లో మిగతా మ్యాచ్‌ల్లో ఫలితాలను పట్టించుకోకపోయినా, రెండు దేశాల్లోనూ పరస్పర యుద్ధంలో గెలుపు ఎవరిదన్న ఆసక్తి కనబడుతుంది. ఏ దశలోనైనా పాకిస్తాన్‌ను ఓడిస్తే చాలని, ఆతర్వాత టోర్నీలో టైటిల్ గెలిచినా, ఓడినా ఒకటేనని భారత అభిమానుల అభిప్రాయం. పాక్‌పై గెలిస్తే టైటిల్ సాధించినంతగా సంబరాలు చేసుకుంటారు. ఓడితే, పూర్తి టోర్నీనే కోల్పోయినంతగా కుంగిపోతారు. ఇదే వైఖరి పాకిస్తాన్‌లోనూ కనిపిస్తుంది. సాధారణ పరిస్థితుల్లోనే ఈ రెండు దేశాల మధ్య జరిగే హాకీ మ్యాచ్ యుద్ధాన్ని పోలి ఉంటుంది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న స్థితిలో జరిగే మ్యాచ్ ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవడం కష్టం కాదు. దీనిని కూడా మిగతా మ్యాచ్‌ల్లో ఒకటిగానే భావిస్తామని, ఎలాంటి ప్రత్యేకతను ఆపాదించకుండా ఆడుతామని భారత కెప్టెన్ శ్రీజేష్, పాకిస్తాన్ కెప్టెన్ ఖవాజా జునైద్ అంటున్నప్పటికీ, మ్యాచ్ ఫలితంపై తమతమ దేశాల్లో ఏ విధంగా స్పందన ఉంటుందనేది ఇద్దరికీ తెలుసు. ఆ కారణంగానే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. ఈ టోర్నీలో ఇరు జట్ల ఆట తీరును పరిశీలిస్తే, పాకిస్తాన్‌పై భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.