క్రీడాభూమి

బౌలర్లదే కీలక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, అక్టోబర్ 22: న్యూజిలాండ్‌పై భారత్ రెండు వనే్డల్లోనూ టాస్‌ను గెలిచింది. ధర్మశాల, ఢిల్లీల్లో మాదిరిగానే మరోసారి కెప్టెన్ ధోనీ టాస్ నెగ్గితే, కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే కీలక బాధ్యతను బౌలర్లు స్వీకరించాలి. చాలాకాలం తర్వాత భారత్‌కు సీమర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో లభించాడు. ఢిల్లీ వనే్డలో అతను జట్టును విజయం అంచుల వరకు చేర్చాడు. అయితే, కెరీర్‌లో కేవలం రెండో వనే్డను ఆడిన అతను పరుగుల వేటలో ఒత్తిడికి గురై, బలహీనమైన షాట్‌తో వికెట్‌ను పారేసుకున్నాడు. మూడో వనే్డలో అతను ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలి. స్పిన్నర్లు అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మరోసారి జట్టుకు అండగా నిలిచే సత్తా వీరికి ఉంది.
ఫలించని వ్యూహం
న్యూజిలాండ్ విషయానికి వస్తే ధర్మశాలలో ఆడిన జట్టులో మూడు మార్పులతో రెండో వనే్డ ఆడింది. గాయపడిన జిమీ నీషమ్ స్థానంలో ఆంటన్ డెవిసిచ్ జట్టులోకి వచ్చాడు. అదే విధంగా ఇష్ సోధీని కాదని జట్టు మేనేజ్‌మెంట్ స్పిన్నర్ మాట్ హెన్రీకి అవకాశం కల్పించింది. డౌగ్ బ్రాస్‌వెల్‌కు బదులు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చాడు. వీరిలో బౌల్ట్ తప్ప, మిగతా ఇద్దరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. మూడు మార్పులతో భారత్‌ను ఇబ్బంది పెట్టాలన్న కెప్టెన్ విలియమ్‌సన్ వ్యూహం ఫలించలేదు. అయితే, టిమ్ సౌథీ చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేయడంతో న్యూజిలాండ్‌కు విజయం సాధ్యమైంది.

చిత్రం..అమిత్ మిశ్రా