క్రీడాభూమి

టీమిండియా గెలవాలంటే ఎదురుదాడే మార్గం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, అక్టోబర్ 22: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో న్యూజిలాండ్‌కు వైట్‌వాష్ వేసిన భారత క్రికెట్ జట్టు వనే్డ సిరీస్‌లో తడబడుతున్నది. ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డను గెల్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత్‌కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన రెండో మ్యాచ్‌లో చుక్కెదురైంది. చివరి వరకూ పోరాడినప్పటికీ, పరుగుల వేటలో విఫలమై, ఆరు పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. నిలకడలేమితోపాటు, సరైన వ్యూహంతో ఆడకపోవడమే ధోనీ సేన ఓటమికి ప్రధాన కారణం. వేగంగా పరుగులు కొల్లగొట్టాల్సిన సమయంలో ధోనీ వికెట్ల వద్ద పాతుకుపోయేందుకు ప్రయత్నించడం మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచింది. మూడో వనే్డలో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించాలంటే, ఎదురుదాడికి దిగడం తప్ప భారత్‌కు మరో మార్గం లేదు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం కూడా భారత్ పరాజయానికి కారణమైంది. మొదటి వనే్డని ఇంకా 101 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేయడంతో రెండో వనే్డలోనూ సునాయాస విజయం సాధ్యమన్న ధీమాతో ధోనీ బృందం బరిలోకి దిగింది. కానీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సెంచరీతో రాణించి, ఆ జట్టును ఆదుకోగా, జట్టును గెలిపించే బాధ్యతను బౌలర్లు స్వీకరించారు. సమష్టి కృషితో కివీస్ గెలిచింది. వ్యూహ రచనలో విఫలమైన భారత్ ఓడింది. అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతను జట్టులోని ప్రతి ఒక్కరిపై ఉంది.
నింపాదిగా పరుగుల వేట!
కీలక సమయాల్లో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వేటను నింపాదిగా కొనసాగించారు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వేగంగా మరో 10 నుంచి 15 పరుగులు సాధించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆటను తీవ్రంగా ప్రభావం చేసే సమయాల్లో సాగిన మందకొడి నడకకు భారత్ భారీ మూల్యానే్న చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా, గాయం కారణంగా శిఖర్ ధావన్ అందుబాటులో లేకపోవడంతో, మొదటి మూడు వనే్డలకు ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించిన ఆజింక్య రహానే మళ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. రెండో వనే్డలో కండరాల నొప్పితో బాధపడిన రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే సందర్భాన్ని, జట్టు అవసరాలను బట్టి ఆడాలి. ఆరో స్థానంలో మైదానంలోకి వచ్చిన కేదార్ పాండే 41 పరుగులు చేసి, జట్టు విజయంపై ఆశలు రేపాడు. ధోనీతో కలిసి ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అతను మూడో వనే్డలోనూ రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సురేష్ రైనా ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియడం లేదు. దీనితో కివీస్‌తో జరిగే చివరి వనే్డల్లోనూ జాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం (పిసిఎ) మైదానంలో మూడేళ్ల క్రితం చివరి వనే్డ ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ మ్యాచ్‌లో 139 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. కాగా, అప్పటి నుంచి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ సెంచరీని నమోదు చేయలేకపోయాడు. అయితే, ఆదివారం నాటి మ్యాచ్‌లో ధోనీ మళ్లీ చెలరేగుతాడని, భారీ స్కోరు సాధిస్తాడని అభిమానులు ధీమా వ్యక్త చేస్తున్నారు.
భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వనే్డలోనూ స్టార్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయం. అతను చివరిసారి మొహాలీలో ఈ ఏడాది మార్చి 27న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అందులో 51 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అతని ప్రతిభతో టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీఫైనల్స్ చేరింది. స్థానిక అభిమానులు అతని నుంచి మరోసారి అదే స్థాయి బ్యాటింగ్‌ను ఆశిస్తున్నారు.

చిత్రం..న్యూజి లాండ్ తో ఆదివా రం న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే మూడో వనే్డ ఇంటర్నేషనల్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.