క్రీడాభూమి

ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 22: ప్రపంచ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ వరుసగా మూడోసారి గెల్చుకొని హ్యాట్రిక్ సాధించింది. మొత్తం మీద ఈ టైటిల్‌ను అందుకోవడం మన దేశానికి ఇది ఎనిమిదోసారి. శనివారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో 38-29 తేడాతో విజయం సాధించి, అంతర్జాతీయ కబడ్డీలో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకుంది. సూపర్ టెన్‌ను సాధించిన అజయ్ ఠాకూర్ భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. అతను మొత్తం 12 రైడ్ పాయింట్లు సంపాదించడం విశేషం. ఫస్ట్ హాఫ్‌లో అద్భుతంగా ఆడిన ఇరాన్ ద్వితీయార్ధంలోనూ గట్టిపోటీనే ఇచ్చింది. అయితే, భారత్ కూడా తగిన రీతిలో సమాధానమివ్వడంతో మ్యాచ్ చివరి వరకూ హోరాహోరీగా కొనసాగింది. కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇది మూడో ప్రపంచ కప్‌కాగా, భారత్ వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. ప్రపంచ కప్ ప్రవేశపెట్టిన తర్వాత భారత్ టైటిల్‌ను అందుకోవడం ఇది ఎనిమిదోసారి. కొత్త ఫార్మెట్‌లో ఇరాన్ ముచ్చటగా మూడోసారి రన్నర్ ట్రోఫీని సంపాదించుకుంది. ఈసారి ఫైనల్‌లో ఇరాన్ కెప్టెన్ మిరాజ్ షేక్ అత్యధికంగా ఏడు పాయంట్లు సాధించాడు. అబుల్‌ఫజల్ మగసొద్‌లొ నాలుగు పాయంట్లు సంపాదించాడు.
ఇరాన్‌ను సులభంగా ఓడిస్తుందని అనుకున్న భారత్ తుదిపోరు ఆరంభంలో తడబడింది. ప్రత్యర్థి నుంచి ఎదురైన తీవ్రమైన ప్రతిఘటనను తిప్పికొట్టడంలో విఫలమైంది. ఫలితంగా మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 13-18 తేడాతో వెనుకబడింది. అప్పటి వరకూ జరిగిన ఆట తీరును బట్టి చూస్తే, ట్రోఫీని ఇరాన్ చేజిక్కించుకుంటుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ, ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్లు సంయమనంతో ఆడారు. పొరపాట్లను సరిదిద్దుకుంటూ, సమయం దొరికిన ప్రతిసారీ ఎదురుదాడి చేశారు. ఫలితంగా క్రమంగా పాయింట్లు పెరుగుతూ వచ్చాయి. ఒకసారి ఇరాన్‌ను వెనక్కునెట్టి, ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత భారత్‌కు వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, చివరికి మ్యాచ్‌ని తొమ్మిది పాయింట్ల తేడాతో సొంతం చేసుకుంది.

చిత్రం.. భారత్, ఇరాన్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో శనివారం జరిగిన ప్రపంచ కప్ కబడ్డీ ఫైనల్‌లో గెలిచిన భారత ఆటగాళ్ల ఆనందం