క్రీడాభూమి

బంగ్లా, ఇంగ్లాండ్ హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, అక్టోబర్ 23: బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నది. మ్యాచ్ చివరి రోజైన సోమవారం ఇంకా 33 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది. రెండు వికెట్లు పడగొట్టగలిగితే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఈ పరిస్థితుల్లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 293 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులు చేసి, బంగ్లాదేశ్ ముందు 286 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని అందుకోవడానికి రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ మ్యాచ్ నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. విజయానికి ఈ జట్టు 33 పరుగుల దూరంలో నిలిచింది. సబ్బీర్ రహ్మాన్ 59, తైజుల్ ఇస్లాం 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఏ స్థాయిలో రాణిస్తారన్న అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారాపడ్డాయి.