క్రీడాభూమి

ఇనెస్టాకు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, అక్టోబర్ 23: బార్సిలోనా కెప్టెన్ ఆండ్రెస్ ఇనెస్టా మోకాలుకు బలమైన గాయం తగిలింది. దీనితో అతను కనీసం మూడు వారాలు సాకర్‌కు దూరంకానున్నాడు. వలెన్షియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడుతూ, 14వ నిమిషంలోనే ఇనెస్టా గాయపడ్డాడు. నొప్పితో బాధపడుతూ కదల్లేని పరిస్థితిలో ఉన్న అతనిని నిర్వాహకులు స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు. కాగా, అతని మోకాలి వద్ద కండరాలు చిట్లినట్టు వైద్యులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాతగానీ స్పష్టత రాదని ప్రకటించారు. అయితే, కనీసం మూడు వారాలు అతను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇలావుంటే, కెరీర్ ప్రమాదంలో పడిందనే భయం తనను వెంటాడుతున్నదని ఇనెస్టా ఒక ప్రకటనలో వాపోయాడు. మోకాలి గాయాలు త్వరగా తగ్గేవి కాదని వ్యాఖ్యానించాడు. అయితే, తొందరగానే కోలుకొని, మళ్లీ ఫుట్‌బాల్ ఆడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని అన్నాడు.