క్రీడాభూమి

అభిజిత్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూగెవీన్ (డెన్మార్క్), అక్టోబర్ 23: భారత గ్రాండ్‌మాస్టర్, కామనె్వల్త్ చాంపియన్ అభిజిత్ గుప్తా ఇక్కడ జరిగిన హూగెవీన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ‘్ఫడే’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో వరుసగా రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన ఆటగాడిగా అతను రికార్డు నెలకొల్పాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో అతను స్థానిక ఆటగాడు లుకాస్ వాన్ ఫోరీస్ట్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మొత్తం 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, టైటిల్‌ను అందుకున్నాడు. రెండు నుంచి నాలుగు స్థానాలు కూడా భారతీయులకే దక్కడం విశేషం. గ్రాండ్ మాస్టర్లు సందీపన్ చందా (7), లలిత్ బాబు (6.5), శ్యాం సుందర్ (6.5) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.