క్రీడాభూమి

ధోనీ అరుదైన మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, అక్టోబర్ 23: భారత వనే్డ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఫార్మాట్‌లో 9,000 పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాట్స్‌మెన్ జాబితాలో స్థానం సంపాదించాడు. ఈ మ్యాచ్‌లో 80 పరుగులు చేసిన అతని ఖాతాలో ఇప్పుడు మొత్తం 9,058 పరుగులు ఉన్నాయి. కాగా, వనే్డల్లో పది వేలకుపైగా పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 18,426 పరుగలు చేయగా, కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు.
వికెట్‌కీపర్లలో ఎక్కువ వనే్డ పరుగులు చేసిన వారిలో సంగక్కర, ఆడం గిల్‌క్రిస్ట్ (9,410) తర్వాత ధోనీ మూడో స్థానంలో నిలిచాడు.
అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ల్యూక్ రోన్చీని స్టంప్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 150 స్టంపింగ్స్ మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకూ ఆడిన 444 మ్యాచ్‌ల్లో అతను 151 స్టంపింగ్స్ చేశాడు. కుమార సంగక్కర 464 మ్యాచ్‌ల్లో 139, రొమేష్ కలువితరణ 234 మ్యాచ్‌ల్లో 101 చొప్పున స్టంపింగ్స్ చేసి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.