క్రీడాభూమి

విరాట్ కోహ్లీ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, అక్టోబర్ 23: రెండో వనే్డలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ సంఘం (పిసిఎ) మైదానంలో జరిగిన మూడో వనే్డలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ శతకంతో కదం తొక్కి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించడానికి 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో పది బంతులు మిగిలి ఉండ3గానే, ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. కోహ్లీకి, వనే్డ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చక్కటి సహకారాన్ని అందించడంతో భారత్ విజయం సులభమైంది.
ఆదుకున్న నీషమ్, హెన్రీ
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్‌ను ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను జిమీ నీషమ్, మాట్ హెన్రీ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు టామ్ లాథమ్ (61), రాస్ టేలర్ (44) కలిసి నమోదు చేసిన 73 పరుగుల భాగస్వామ్యానికి నీషమ్, హెన్రీ 84 పరుగుల పార్ట్‌నర్‌షిప్ కూడా జత కలవడంతో కివీస్ కోలుకుంది. మార్టిన్ గుప్టిల్ (27), కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (22) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా, సెకండ్ డౌన్‌లో వచ్చిన మాజీ కెప్టెన్ రాస్ టేలర్‌తో కలిసి ఓపెనర్ లాథమ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద అమిత్ మిశ్రా బంతిని ముందుకెళ్లి ఆడేందుకు ప్రయత్నించిన టేలర్‌ను వికెట్‌కీపింగ్ చేస్తున్న ధోనీ స్టంప్ చేశాడు. దీనితో న్యూజిలాండ్‌కు బలమైన భాగస్వామ్యానికి తెరపడింది. కొరీ ఆండర్సన్ (6), ల్యూక్ రోన్చీ (1) వెంటవెంటనే అవుట్‌కాగా, క్రీజ్‌లో నిలదొక్కుకొని, 72 బంతుల్లో 61 పరుగులు చేసిన లాథమ్‌ను హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా కేదార్ జాదవ్ పెవిలియన్‌కు పంపాడు. మిచెల్ సాంట్నర్ (7), టిమ్ సౌథీ (13) భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక వెనుదిరిగారు. 200 పరుగుల మైలురాయిని కూడా చేరుకోకుండానే ఎనిమిది వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌కు నీషమ్, హెన్రీ అండగా నిలిచారు. తొమ్మిది వికెట్‌కు ఎవరూ ఊహించని విధంగా 84 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. నీషమ్ 47 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లతో 57 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు చిక్కాడు. చివరిలో ట్రెంట్ బౌల్ట్ (1)ను జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు 49.4 ఓవర్లలో 285 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి హెన్రీ 39 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 37 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
ఆరంభంలో తడబాటు..
న్యూజిలాండ్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా ఆరంభంలో తబడింది. ఆజింక్య రహానే కేవలం ఐదు పరుగులు చేసి, మాట్ హెన్రీ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు చిక్కాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద టిమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే బాధ్యతను కోహ్లీ, ధోనీ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. ధోనీ ఆచితూచి ఆడగా, కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగులను రాబట్టాడు. న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆడిన వీరు మూడో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 91 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 80 పరుగులు చేసిన ధోనీని రాస్ టేలర్ క్యాచ్ పట్టగా మాట్ హెన్రీ అవుట్ చేశాడు. అనంతరం థర్డ్ డౌన్‌లో వచ్చిన మనీష్ పాండేతో కలిసి కోహ్లీ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ జట్టును గెలిపించాడు. భారత్ 48.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ 134 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 154, మనీష్ పాండే 34 బంతుల్లో 28 అప్పటికి నాటౌట్‌గా ఉన్నారు.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 27, టామ్ లాథమ్ సి హార్దిక్ పాండ్య బి కేదార్ జాదవ్ 61, కేన్ విలియమ్‌సన్ ఎల్‌బి కేదార్ జాదవ్ 22, రాస్ టేలర్ స్టంప్డ్ ధోనీ బి అమిత్ మిశ్రా 44, కొరీ ఆండర్సన్ సి ఆజింక్య రహానే బి కేదార్ జాదవ్ 6, ల్యూక్ రోన్చీ స్టంప్డ్ ధోనీ బి అమిత్ మిశ్రా 1, జిమీ నీషమ్ సి కేదార్ జాదవ్ బి ఉమేష్ యాదవ్ 57, మిచెల్ సాంట్నర్ సి విరాట్ కోహ్లీ బి జస్‌ప్రీత్ బుమ్రా 7, టిమ్ సౌథీ బి ఉమేష్ యాదవ్ 13, మాట్ హెన్రీ 39 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ బి జస్‌ప్రీత్ బుమ్రా 1, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (49.4 ఓవర్లలో) 285 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-48, 2-80, 3-153, 4-160, 5-161, 6-169, 7-180, 8-199, 9-283, 10-285.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 10-0-75-3, హార్దిక్ పాండ్య 5-0-34-0, జస్‌ప్రీత్ బుమ్రా 9.4-0-52-2, కేదార్ జాదవ్ 5-0-29-3, అక్షర్ పటేల్ 10-0-49-0, అమిత్ మిశ్రా 10-0-46-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ ఎల్‌బి టిమ్ సౌథీ 13, ఆజింక్య రహానే సి మిచెల్ సాంట్నర్ బి మాట్ హెన్రీ 5, విరాట్ కోహ్లీ 154 నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ సి రాస్ టేలర్ బి మాట్ హెన్రీ 80, మనీష్ పాండే 28 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (48.2 ఓవర్లలో 3 వికెట్లకు) 289.
వికెట్ల పతనం: 1-13, 2-41, 3-192.
బౌలింగ్: మాట్ హెన్రీ 9.2-0-56-2, ట్రెంట్ బౌల్ట్ 10-0-73-0, టిమ్ సౌథీ 10-0-55-1, మిచెల్ సాంట్నర్ 10-0-43-0, జిమీ నీషమ్ 9-0-60-0.