క్రీడాభూమి

మూడు వేల మీటర్ల పరుగులో రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌కు స్వర్ణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 10: కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ జాతీయ గ్రామీణ క్రీడా పోటీల అండర్-16 అథ్లెటిక్స్ విభాగంలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పతకాల కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ఆదివారం జరిగిన మూడువేల మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో రాజస్థాన్‌కు చెందిన హేమత్ స్వర్ణ పతకాన్ని, మహారాష్టక్రు చెందిన కరన్‌డిండే రజత పతకాన్ని, హర్యానాకు చెందిన అభయ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సీమ స్వర్ణం, మహారాష్టక్రు చెందిన అంకిత రాజేంద్రన్ గవాలే రజతం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎ చంద్రుడమ్మ కాంస్య పతకాలను సాధించారు. అలాగే 800 మీటర్ల పరుగు బాలుర విభాగంలో గుజరాత్‌కు చెందిన వాసనికన్వీర్.జె టైటిల్ సాధించింది. హర్యానాకు చెందిన శంకర్, మందీప్ వరుసగా రజత, కాంస్య పతకాలను, బాలికల విభాగంలో హర్యానాకు చెందిన పూజామాలిక్ స్వర్ణ, పంజాబ్‌కు చెందిన గురుతీత్‌కౌర్ రజత, బీహార్‌కు చెందిన తరవాటిసోరెన్ కాంస్య పతకాలను సాధించారు. 100మీటర్ల బాలుర విభాగంలో మహారాష్టక్రు చెందిన విల్లభ్‌పాటిల్ బంగారు, తెలంగాణ అథ్లెట్ ఎస్. సాయి రజత, కర్ణాటకకు చెందిన అభిన్ కాంస్య పతకాన్ని, బాలికల విభాగంలో కేరళకు చెందిన అంజలి.పిడి బంగారు, కర్ణాటకకు చెందిన ధనేశ్వరి. ఎటి రజత, కర్ణాటకకు చెందిన జోస్న.ఎస్‌ఎన్ కాంస్య పతకాలను, హైజంప్ బాలుర విభాగంలో ఢిల్లీకి చెందిన షాన్‌వాజ్‌ఖాన్ బంగారు, రవీంద్రారెడ్డి (ఆంధ్రప్రదేశ్) రజత, హర్యానాకు చెందిన మోహిత్ కాంస్య పతకాలను, షార్ట్‌పుట్ బాలికల విభాగంలో పరంజోత్‌కౌర్ స్వర్ణ (పంజాబ్), యోగిత రజత (హర్యానా), నీలిమ (ఆంధ్రప్రదేశ్) కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.