క్రీడాభూమి

కివీస్‌తో చివరి రెండు వనే్డలకూ అదే జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వనే్డ ఇంటర్నేషనల్స్‌కు ఎంపిక చేసిన జట్టునే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించాలని జాతీయ సెలక్టర్లు నిర్ణయించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. డెంగ్యూ వ్యాధి సోకిన సురేష్ రైనా ఇంకా పూర్తి ఫిట్నెస్‌తో లేడని పేర్కొంది. చివరి రెండు మ్యాచ్‌లకు 14 మంది సభ్యులతో కూడిన అదే జట్టును కొనసాగించాలని సెలక్టర్లు ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ మూడు వనే్డలు జరగ్గా, భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. నాలుగో వనే్డ ఈనెల 26న రాంచీలో, చివరిదైన ఐదో మ్యాచ్ 29న విశాఖపట్నంలో జరుగుతాయి.
జట్టు వివరాలు
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఆజింక్య రహానే, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, ధవళ్ కులకర్ణి, ఉమేష్ యాదవ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 105.5 ఓవర్లలో 293 ఆలౌట్ (జో రూట్ 40, మోయిన్ అలీ 68, జాన్ బెయిర్‌స్టో 52, మెహదీ హసన్ మిరాజ్ 6/80, షకీబ్ అల్ హసన్ 2/46, తైజుల్ ఇస్లామ్ 2/47).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 86 ఓవర్లలో 248 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 78, మహమ్మదుల్లా 38, ముష్ఫికర్ రహీం 48, బెన్ స్టోక్స్ 4/26, మోయిన్ అలీ 3/75, అదిల్ రషీద్ 2/58).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 80.2 ఓవర్లలో 240 ఆలౌట్ (బెన్ స్టోక్స్ 85, జానీ బెయిర్‌స్టో 47, షకీబ్ అల్ హసన్ 5/85, తైజుల్ ఇస్లామ్ 2/41).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 286/ ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్లకు 253): 81.3 ఓవర్లలో 263 ఆలౌట్ (ఇమ్రుల్ ఖయాస్ 43, ముష్ఫికర్ రహీం 39, సబ్బీర్ రహ్మాన్ 64 నాటౌట్, బెన్ స్టోక్స్ 2/20, స్టువర్ట్ బ్రాడ్ 2/31, గెరాత్ బాటీ 3/65, మోయిన్ అలీ 2/60).

చిత్రం.. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగే నాలుగో వనే్డలో పాల్గొనేందుకు సోమవారం రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం చేరుకున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (ఎడమ), స్టార్ బ్యాట్స్‌మెన్ ఆజింక్య రహానే, విరాట్ కోహ్లీ తదితరులు