క్రీడాభూమి

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీస్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 26: ఇక్కడ జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ అధికారికంగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మలేసియాతో మ్యాచ్‌కి ముందు భారత్ సెమీస్ స్థానం దాదాపు ఖరారుకాగా, ఈ మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొన్న శ్రీజేష్ బృందం నంబర్ వన్ స్థానాన్ని పదిలపరచుకుంది. రూపీందర్‌పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత్‌ను గెలిపించాడు. అతను 12వ నిమిషంలో గోల్ సాధించి, భారత్‌కు ఆధిక్యాన్ని అందించగా, మరో ఆరు నిమిషాల్లోనే మలేసియా ఆటగాడు రహీం రజా ఈక్వెలైజర్‌ను సాధించాడు. ఆతర్వాత ఇరు జట్లు వ్యూహాత్మక ‘డిఫెన్స్’తో ఆటను కొనసాగించాయి. ద్వితీయార్ధం మొదట్లోనూ ఆటలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే, 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను రూపీందర్ గోల్‌గా మలచి, భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆతర్వాత భారత్ రక్షణ వలయాన్ని బలోపేతం చేయగా, దానిని ఛేదించడంలో విఫలమైన మలేసియా పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానాన్ని ఆక్రమించడం ద్వారా ఆ జట్టు సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
కొరియా ముందంజ
జపాన్‌ను 4-3 తేడాతో ఓడించిన కొరియా సెమీ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో జపాన్ తీవ్ర స్థాయిలో పోరాడినప్పటికీ, కొరియా కెప్టెన్ జంగ్ మంజావో కీలక గోల్స్ కారణంగా పరాజయాన్ని ఎదుర్కోక తప్పలేదు. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే కిమ్ జువాన్ కొరియాకు తొలి గోల్‌ను అందించగా, ఎనిమిదో నిమిషంలో కజుమా మురాతా ద్వారా జపాన్‌కు ఈక్వెలైజర్ లభించింది. 32వ నిమిషంలో కొరియాకు కెప్టెన్ జంగ్ గోల్ అందిస్తే, 44వ నిమిషంలో జపాన్ ఆటగాడు హిరోకీ సకమొతో స్కోరును సమం చేశాడు. ఒక్క నిమిషం తేడాలోనే కెంటా తనామ గోల్ చేయడంతో, జపాన్ 3-2 ఆధిక్యానికి చేరింది. కానీ, ఎదురుదాడికి దిగిన కొరియా 47వ నిమిషంలో కిమ్ సూయింగ్ హూన్ ద్వారా స్కోరును మరోసారి సమం చేయగలిగింది. రెండు నిమిషాల వ్యవధిలో జంగ్ తన రెండో గోల్‌ను నమోదు చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. కొరియా 4-3 ఆధిక్యంతో గెలిచి, సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

నాకౌట్‌పై హారిక దృష్టి
డేప్ డాడే (ఫ్రాన్స్), అక్టోబర్ 26: భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఇక్కడ జరుగుతున్న అన తొలి కార్పోర్ ర్యాపిడ్ ఇంటర్నేషనల్ చెస్ టోర్న మెంట్‌లో నాకౌట్ దశపై దృష్టి పెట్టింది. ఆ దిశగా అడుగులు వేస్తున్నది. రెండో రోజు గేమ్స్‌లో ఆమె సబ్రిన వెగా గటిరెజ్‌ను ఓడించింది. అనంతరం మథియూ కొనెట్‌తో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఇం కా నాలుగు రౌండ్ల గేమ్స్ మిగిలి ఉండగా, నాకౌట్ కు చేరుతానని హారిక ధీమా వ్యక్తం చేసింది. ప్రతి గేమ్‌కూ ఎంతో ప్రాధాన్యం ఉందని ఆమె పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది.