క్రీడాభూమి

విశాఖ చేరుకున్న భారత్, కివీస్ క్రికెటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 27: ఈనెల 29 విశాఖ వేదికగా జరిగే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు గురువారం నగరానికి చేరుకున్నారు. చార్టర్ ఫ్లయిట్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చిన ఇరు జట్లకు ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి వసతి ఏర్పాటు చేసిన నోవాటెల్ హోటల్‌కు చేర్చారు. అక్కడ వారికి హోటల్ సిబ్బంది పూలమాలలు, నుదుట తిలకం దిద్ది స్వాగతం పలికారు. హోటల్ గదిలో విశ్రాంతి తీసుకున్న న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు సాయంత్రం షాపింగ్ చేశారు. సిఎంఆర్ సెంట్రల్‌లో షాపింగ్ చేస్తూ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇరుజట్లు విశాఖ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తారు.
ఇబ్బంది లేనట్టే!
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య విశాఖలో శనివారం జరిగే అయిదో వనే్డ మ్యాచ్‌కు దాదాపు ఇబ్బంది ఉండకోవచ్చు. బుధవారం వరకూ కయాంత్ తుపాను ప్రభావం మ్యాచ్‌పై పడుతుందన్న ఆర్గనైజింగ్ కమిటీ, గురువారం ఈ తుపాను నెల్లూరు, తమిళనాడు వైపు పయనిస్తోందన్న వార్తలతో క్రీడాభిమానులు ఆనందంగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్లన్నీ సేల్ అవగా 3, 5 వేల టికెట్లు మాత్రం కొన్ని మిగిలి ఉన్నాయి. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు విలేఖరులకు తెలిపారు.

చిత్రం.. విశాఖలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న న్యూజిలాండ్ క్రికెటర్లు