క్రీడాభూమి

నాలుగా? ఆరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 28: భారత పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై మరోసారి చర్చ ఊపందుకుంది. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితేనే మంచిదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి వారు అభిప్రాయపడుతుంటే, అతనికి ఆరో స్థానమే సరైనదని మరికొందరు వాదిస్తున్నారు. న్యూజిలాండ్‌తో రాంచీలో జరిగిన నాలుగో వనే్డలో ధోనీ 11 పరుగులకే అవుట్ కావడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. సొంత గడ్డపై ధోనీ సేన ఓడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన ధోనీ క్రీజ్‌లో నిలదొక్కుకోలేక, జిమీ నీషమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను అవుటైన విధానాన్ని విశే్లషకులు తప్పుపడుతున్నారు. ఇటీవల కాలంలో ధోనీ వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడన్నది వాస్తవం. బ్యాటింగ్‌కు దిగిన మరుక్షణం నుంచే బౌలర్లపై దాడికి ఉపక్రమించడం, లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన పరుగులను కొల్లగొట్టడం అతనికి ‘బెస్ట్ మ్యాచ్ ఫినిషర్’ అనే మద్రను వేశాయి. కానీ, చాలాకాలంగా అతను మ్యాచ్‌ని తనదైన శైలిలో ముగించలేకపోతున్నాడు. అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, ఎక్కువ బంతులను మింగేసి, ఆ తర్వాత అవుట్ కావడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడిని పెంచుతున్నదన్న వాదన బలపడుతున్నది. అందుకే, అతను నాలుగో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కానీ, గంగూలీ, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ తదితరులు ధోనీకి నాలుగో స్థానమే సరైనదని అంటున్నారు. అతను తాత్కాలికంగా ఫామ్‌ను కోల్పోయి ఉండవచ్చేమోగానీ అది శాశ్వతం కాదని వారి వాదన. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం వల్ల జట్టుకు ప్రయోజనం ఏమీ ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలావుంటే, వికెట్‌కీపింగ్‌లో ఇంకా మెరుపులు మెరిపిస్తున్న ధోనీ బ్యాటింగ్‌లో మాత్రం పూర్వ వైభవాన్ని కొనసాగించలేక డీలాపడుతున్నాడు. కివీస్‌తో జరిగిన నాలుగో వనే్డలో రాస్ టేలర్‌ను అవుట్ చేసిన విధానం ధోనీ ప్రతిభకు అద్దం పడుతుంది. బౌండరీ లైన్ వద్ద ఆపిన బంతిని ధవళ్ కులకర్ణి నేరుగా ధోనీకి త్రో చేశాడు. బంతిని అందుకున్న ధోనీ వెనక్కి తిరిగి చూడకుండానే దానితో స్టంప్స్‌ను కొట్టిన విధానం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ధోనీ ఒక్క క్షణం ఆలస్యం చేసినా టేలర్ సురక్షితంగా క్రీజ్‌లోకి చేరుకొని ఉండేవాడు. కానీ, ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వకుండా ధోనీ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు.
న్యూజిలాండ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయడంలో తనవంతు పాత్ర పోషించిన ధోనీ ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యాడు. నీషమ్ బంతిని అతను ఆడిన తీరు విమర్శలకు తావిస్తోంది. బంతి దిశను అర్థం చేసుకోలేకపోయిన అతను క్లీన్ బౌల్డ్ కావడం అభిమానుల అంచనాలను తల్లకిందులు చేసింది. చాలాకాలంగా పరుగుల వేటలో అతను తడబడుతున్నాడు. మళ్లీ ఫామ్‌లోకి రావాలన్న ఆశతో క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి నింపాదిగా ఆడుతున్నాడు. బంతులు మింగేస్తున్నాడు. చివరికి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను నాలుగు నుంచి ఆరో స్థానానికి మార్చుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.