క్రీడాభూమి

అమ్మకు ప్రేమతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 29: భారత క్రికెటర్లు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. స్టార్ ప్లస్ ‘నరుూ సోంచ్’ (కొత్త ఆలోచన) పేరుతో రూపొందించిన కార్యక్రమానికి ఆటగాళ్లంతా మద్దతుపలికారు. న్యూజిలాండ్‌తో ఇక్కడ జరిగిన చివరి వనే్డలో టీమిండియా క్రికెటర్లు తమ తల్లి పేరు ఉన్న జెర్సీలను ధరించారు. తండ్రి గురించి ఎక్కువగా చెప్తారేగానీ, ప్రతి మనిషి జీవితంలో ఎంతో కీలకంగా వ్యవహరించే తల్లి గుర్తు చేసుకోవడం చాలా అరుదని కెప్టెన్ ధోనీ వ్యాఖ్యానించాడు. స్వాతంత్య్ర లేదా గణతంత్ర దినోత్సవాల రోజున మాత్రమే జవాన్లను తలచుకొని ఆ తర్వాత మరచిపోవడం తగదని, దేశానికి వారు చేస్తున్న సేవలను ప్రతి రోజూ గుర్తు చేసుకోవాలని అన్నాడు. అదే విధంగా తల్లిని గుర్తు చేసుకుంటూ దిన చర్య మొదలు పెట్టాలని చెప్పాడు.