క్రీడాభూమి

మెస్సీకి బాలన్ అవార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్, జనవరి 10: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అందచేసే ప్రతిష్ఠాత్మక బాలన్ డిఆర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీని హాట్ ఫేవరిట్‌గా విశే్లషకులు పేర్కొంటున్నారు. అయితే, బ్రెజిల్ స్ట్రయికర్ నేమార్, ఉరుగ్వే స్టార్ లూయిస్ సౌరెజ్, మూడు పర్యాయాలు ఈ అవార్డును అందుకున్న పోర్చుగల్ హీరో క్రిస్టియానో రొనాల్డో నుంచి మెస్సీకి తీవ్రమైన పోటీ ఎదురవుతున్నది. గత ఏడాది వీరంతా అద్భుత ప్రతిభ కనబరచినవారే కావడం విశేషం. మార్సిలోనా తరఫున 48 గోల్స్ చేసిన మెస్సీ 2009 నుంచి 2012 వరకూ వరుసగా నాలుగు పర్యాయాలు బాలన్ డి ఆర్ అవార్డును అందుకున్నాడు. ఐదోసారి అవార్డుకు ఎంపికైతే, అత్యధిక పర్యాయాలు దీనిని స్వీకరించిన ఫుట్‌బాలర్‌గా కొత్త రికార్డు సృష్టిస్తాడు. కాగా, 2008లో మొదటిసారి, ఆతర్వాత 2013, 2014 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు బాలన్ డిఆర్ అవార్డును అందుకున్న రొనాల్డో గత ఏడాది గోల్స్ వరద పారించాడు. రియల్ మాడ్రిడ్‌కు ఎన్నో కీలకమైన విషయాలను అందించాడు. అయితే, హఠాత్తుగా ఆ జట్టు పట్టును కోల్పోయి, చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరకుండానే వెనుదిరగడంతో రొనాల్డో ప్రతిష్ఠ దెబ్బతింది. ఈ నేపథ్యంలో అతనికి బాలన్ డిఆర్ అవార్డు లభిస్తుందా అన్నది అనుమానంగా ఉంది. కాగా, నేమార్, సౌరెజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, అందరికంటే మెస్సీ ఈ రేసులో ముందున్నాడు.