క్రీడాభూమి

ప్రతుల్‌కు తొలి పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెగయా, (బహ్రెయిన్), నవంబర్ 2: భారత యువ బాడ్మింటన్ ఆటగాడు ప్రతుల్ జోషి తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఇక్కడ జరిగిన బహ్రెయిన్ అంతర్జాతీయ చాలెంజ్ బాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో 22 ఏళ్ల ప్రతుల్ 21-17, 12-21, 21-15 ఆధిక్యంతో తన సహచరుడు ఆతిద్య జోషిని ఓడించాడు.
‘వర్మ’ సోదరుల ముందంజ
సార్‌బ్రుకెన్ (జర్మనీ), నవంబర్ 2: ‘వర్మ’ బ్రదర్స్‌గా అందరికీ తెలిసిన భారత బాడ్మింటన్ ఆటగాళ్లు సౌరభ్, సమీర్ ఇక్కడ ఆరంభమైన బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. తమతమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్ చేరారు. సౌరభ్ 21-16, 21-11 తేడాతో, కేవలం 20 నిమిషాల్లోనే ఆస్ట్రియాకు చెందిన రుడిగర్ నెడ్‌ను ఓడించాడు. ఈ ఏడాది భారత జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న సమీర్ 21-11, 21-11 ఆధిక్యంతో అలెగ్జాండర్ రూవర్స్ (జర్మనీ)పై గెలిచాడు. కాగా, యువ ఆటగాళ్లు సిరిల్ వర్మ, శుభాంకర్ డే పరాజయాలను చవిచూశారు. ఆరోసీడ్ ఇషాన్ వౌలానా ముస్త్ఫా (ఇండోనేషియా) చేతిలో సిరిల్ 17-21, 16-21 తేడాతో ఓడాడు. శుభాంకర్‌పై జొనథాన్ క్రిస్టీ (ఇండోనేషియా) 21-19, 21-18 ఆధిక్యంతో నెగ్గాడు.