క్రీడాభూమి

కోలుకోని రోహిత్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఫలితంగా ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి అతను దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో గత నెల 29న విశాఖపట్నంలో జరిగిన చివరి, ఐదో వనే్డ ఆడుతున్న సమయంలో రోహిత్ గాయపడ్డాడు. తొడ కండరాలు చిట్లడంతో అతనికి అత్యవసర వైద్య సేవలు అందించారు. అతని గాయం పట్ల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశాడు. బుధవారం సెలక్టన్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ రోహిత్‌కు శస్తచ్రికిత్స అనివార్యం కావచ్చని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో అతను పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశాడు. అతను గాయపడిన విధానాన్ని టీవీల్లో అందరం చూశామని, దాని తీవ్రత ఏమిటో అప్పుడే తెలిసిందని చెప్పాడు. వైద్య చికిత్స నిమిత్తం అతను ఇంగ్లాండ్ వెళ్లినట్టు తెలిపాడు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత, శస్తచ్రికిత్స అవసరమా లేదా అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపాడు. ఆపరేషన్ జరగకపోయినా, అతను కోలుకోవడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం అవసరమవుతుందని ఎమ్మెస్కే అన్నాడు. ఒకవేళ శస్తచ్రికిత్స జరిగితే, ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ముందు జాగ్రత్తగా అతని పేరును ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ పరిశీలించడం లేదని అన్నాడు. ఇలావుంటే, గతంలోనూ గాయాల సమస్య రోహిత్‌ను వేధించింది. 2010లో అతను ఆస్ట్రేలియాపై నాగపూర్ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ఆరంభించాల్సి ఉండగా, ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ కింద పడి, కాలి మడమ బెణకడంతో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఆ మ్యాచ్‌లో ప్రస్తుత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ కోటాలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పట్లో వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన రోహిత్‌కు టెస్టుల్లో అడుగుపెట్టడానికి మూడేళ్ల సమయం పట్టింది. 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ఆడడం ద్వారా అతను టెస్టు కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఇప్పటి వరకూ అతను కెరీర్‌లో 21 టెస్టులు ఆడాడు. 1,184 పరుగులు చేశాడు. 153 వనే్డ ఇంటర్నేషనల్స్ కూడా ఆడిన అతను ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2014 నవంబర్‌లో శ్రీలంకతో కోల్‌కతాలో జరిగిన వనే్డలో అతను 264 పరుగులు చేశాడు. వనే్డల్లో రెండు పర్యాయాలు డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా అతనే. సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్ (్భరత్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) ఒక్కోసారి వనే్డల్లో డబుల్ సెంచరీ చేశారు. కాగా, రోహిత్ 153 వనే్డల్లో 5,131 పరుగులు సాధించాడు.
గాయాల నుంచి బయటపడని లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ కూడా ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టులో స్థానం దక్కించుకోలేకపోయారు. రోహిత్‌ను ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పూర్తిగా తప్పించగా, రాహుల్, ధావన్, భువీ పేర్లను చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేసే సమయంలో పరిశీలిస్తారు. రాహుల్ కండరాల నొప్పితో బాధపడుతుండగా, ధావన్ వేలికి ఫ్రాక్చరైంది. భువీ వెన్నునొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

ఖర్చులకు సిద్ధంకండి
ఐదు అనుబంధ సంఘాలకు బిసిసిఐ స్పష్టీకరణ
ముంబయి, నవంబర్ 2: ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టులకు ఆతిథ్యమిచ్చే అనుబంధ సంఘాలన్నీ ఆయా మ్యాచ్‌ల నిర్వహణ ఖర్చులకు సిద్ధంగా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. ముందు జాగ్రత్తగా ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని అఫిడవిట్‌ను అన్ని సభ్య సంఘాలు దాఖలు చేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకూ ఆయా సంఘాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని బిసిసిఐకి స్పష్టం చేసింది. డబ్బుల్లేకపోతే, మ్యాచ్‌లను నిర్వహించడం అసాధ్యమన్న బిసిసిఐ వాదనను తోసిపుచ్చింది. కాగా, సుప్రీం ఆదేశాలతో కంగుతిన్న బిసిసిఐ అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నది. ఐదు టెస్టులకు సౌరాష్ట్ర, ఆంధ్ర, పంజాబ్, ముంబయి, తమిళనాడు క్రికెట్ సంఘాలు ఆతిథ్యమిస్తాయి. ఈ మ్యాచ్‌ల నిర్వహణకు ఎంత మొత్తం ఖర్చవుతుందో లెక్కలు వేసుకొని, ఆ మొత్తాలను సొంతంగా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని ఆ ఐదు సంఘాలకు బిసిసిఐ సూచించింది. ఒకవేళ నిధుల విడుదలకు సుప్రీం కోర్టు అంగీకరించకపోతే ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది.