క్రీడాభూమి

హైజంప్‌లో యాన్సీసోజన్‌కు స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 11: కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ జాతీయ గ్రామీణ క్రీడలు అండర్-16 బాలికల లాంగ్‌జంప్ విభాగంలో కేరళకు చెందిన యాన్సీసోజన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హర్యానాకు చెందిన జైత్స్న రజత, కర్ణాటకకు చెందిన ధనేశ్వరి కాంస్య పతకాలను సాధించారు. బాలికల హైజంప్‌లో మహారాష్టక్రు చెందిన నిఖిత స్వర్ణం, కర్ణాటకకు చెందిన ఎస్‌బి సురియా రజత, హర్యానాకు చెందిన మోహిని కాంస్య పతకాలు గెల్చుకున్నారు. 400 మీటర్ల పరుగు బాలుర విభాగంలో ఆకాష్ (కేరళ) స్వర్ణం, అరవింద్ (తెలంగాణ) రజత, అంకిత్ (హర్యానా) కాంస్య పతకాలను సాధించారు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతికాశ్రీ స్వర్ణ పతకాన్ని అందుకుంది. భూమిక (కర్నాటక) రజత, ఖుష్‌బీకౌర్ (పంజాబ్) కాంస్య పతకాలను సాధించారు. బాలుర తైక్వాండో 51-55 కేజీల విభాగంలో మణిపూర్‌కు చెందిన ఎండి నాజర్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోగా, నాగాలాండ్‌కు చెందిన చోటోచోపి రజత, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పి సునీల్‌చావన్, రమేష్ కాంస్య పతకాలను సాధించారు. 73 కేజీలకు పైబడిన విభాగంలో మహారాష్టక్రు చెందిన ధనుంజయ్ గోకుల్ ధవానేకు స్వర్ణ పతకం లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన వినయ్‌కుమార్ రజత, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన బి ప్రబిన్‌కుమార్, వై పర్వతీష్ కాంస్య పతకాలు గెల్చుకున్నారు. 59-63 కేజీల విభాగంలో అస్సాంకు చెందిన రాహుల్ స్వర్ణం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌ఎంవివి సాయి రజత, మిజోరం, కర్నాటకలకు చెందిన పిసి లాల్‌మోన్‌వామ, రజిత్ దోడ్‌వాడ్‌కర్ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

జాతీయ బాల్ బాడ్మింటన్ టోర్నీ
తెలంగాణ శుభారంభం

ఖమ్మం, జనవరి 11: ఖమ్మంలో జరుగుతున్న 61వ జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో తెలంగాణ శుభారంభం చేసింది. మహిళల లీగ్ పోటీల్లో భాగంగా సోమవారం ఉదయం నేషనల్ కెపిఎల్ రీజియన్ (ఎన్‌సిఆర్)పై 35-15, 35-15 స్కోరుతో గెలుపొందిన తెలంగాణ జట్టు సాయంత్రం మరో మ్యాచ్‌లో త్రిపురపై 35-5, 35-8 స్కోరుతో విజయం సాధించి ముందంజ వేసింది. ఇతర మ్యాచ్‌లలో జమ్మూకశ్మీర్‌పై బీహార్ జట్టు 35-8, 35-13 స్కోరుతో మహారాష్టప్రై, తమిళనాడు 35-18, 35-13 స్కోరుతో, మణిపూర్‌పై, చత్తీస్‌గఢ్ 35-11, 35-13 స్కోరుతో ఉత్తర్‌ప్రదేశ్‌పై విజయాలను నమోదు చేశాయ. పురుషుల విభాగంలో జరిగిన లీగ్ పోటీల్లో త్రిపురపై పశ్చిమబెంగాల్, చండీగఢ్‌పై తమిళనాడు, డిఎఎఫ్‌పై ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్‌పై బీహార్, అస్సాంపై చత్తీస్‌గఢ్, పంజాబ్‌పై తమిళనాడు, రాజస్థాన్‌పై మహారాష్ట్ర, ఎన్‌సిఆర్‌పై భారతీయ రైల్వే, పశ్చిమ బెంగాల్‌పై పుదుచ్ఛేరి, మణిపూర్‌పై ముంబై, చత్తీస్‌గఢ్‌పై ఆంధ్రప్రదేశ్, ఎంసిఆర్‌పై గుజరాత్, ఉత్తరప్రదేశ్‌పై మధ్యప్రదేశ్, పంజాబ్‌పై మహారాష్ట్ర, ఒరిస్సాపై ఆటమిక్ ఎనర్జీ జట్టు, చండీగఢ్‌పై మేజర్ ఫోర్డ్, పుదుచ్చేరి జట్లు గెలుపొందాయి. ఈసారి బాల్ బాడ్మింటన్ ఫెడరేషన్ ఈ టోర్నీలో నూతనంగా మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీలు నిర్వహిస్తోంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

అరేబియన్స్ జట్టుకు
సెవాగ్ కెప్టెన్సీ
దుబాయ్, జనవరి 11: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లతో నిర్వహించే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్‌లో జెమినీ అరేబియన్స్ జట్టుకు భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ నాయకత్వం వహిస్తాడు. జట్టు లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. సక్లాయిన్ ముస్తాక్, రిచర్డ్ లెవీ, పాల్ హారిస్, జాక్వెస్ రుడాల్ఫ్, గ్రహం ఆనియన్స్, సకీబ్ అలీ వంటి ఒకప్పటి మేటి క్రికెటర్లు అరేబియన్స్ జట్టులో ఉన్నారు. ఈనెల 28న మొదలై, వచ్చేనెల 13వ తేదీతో ముగిసే ఈటోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు షార్జా, దుబాయ్ కేంద్రాల్లో జరుగుతాయి. అరేబియన్స్ జట్టులో కుమార సంగక్కర, శివనారైన్ చందర్‌పాల్, బ్రాడ్ హాడ్జ్, జస్టిన్ కెంప్, ముత్తయ్య మురళీధరన్, కేల్ మిల్స్, రాణా నవేద్ ఉల్ హసన్, ఆశిష్ బగాయ్ తదితరులు కూడా ఉన్నారని ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. టైటిల్ గెల్చుకునే అవకాశాలు అరేబియన్స్‌కు ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేసింది.